జీవభాష ....!!----డా.కె.ఎల్.వి.ప్రసాద్.

 మనం ఎన్నుకునే 
ప్రభుత్వాలు .....
మనం --
తెలుఁగు వాళ్లం 
అన్నమాట ---
అనందంగా, 
మరచిపోతాయ్ !
అధికార భాష ' తెలుఁగు 'అని 
మహాగొప్పలు 
చెప్పుకుంటాం ...
దుర్భిణి వేసినా 
తెలుగుకనపడని ,
దుర్భరజీవితాన్ని 
గడిపేస్తున్నాం .....!
భోధనాభాషను 
తెలుగుకాకుండాచేసి 
ఆంగ్లంమోజులో ...
తైతక్కలాడుతున్నాం !
పరభాషను --
అసలువద్దని చెప్పలేము ,
పరిమితులు దాటితె,
ఏదైనా అనర్ధమే కదా !
అయితే....
ఏ భాష అయినా 
మాతృబాష తరువాతే నని 
తెలుసుకొవాలి ,
ఈ నేపద్యంలో---
మాతృభాషాభి వృద్ది
మన యింటినుండి....
మన  నుండి....
మన  పిల్లలనుండి
ప్రారంభం కావాలి.....!
నినాదాలు ప్రక్కనపెట్టి,
ప్రాధాన్యతలు---
ఒకరోజుకే పరిమితం చేయక
ప్రతి ఒక్కరూ....
మాతృభాష 
మసకబారి పోకుండా
నిత్యం తెలుగుకు--
ప్రాధాన్యత నివ్వాలి....
భాషను కలకాలం ---
జీవభాషగా నిలబెట్టుకోవాలి!!
                  ***
కామెంట్‌లు