పాండవుల ఆయుధాల రక్షణ! అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండవుల అజ్ఞాతవాసం లో అతిముఖ్యమైన కష్టమైన పని వారికున్న ఆయుధాలను దాచుకోవడం.అవి సామాన్యమైనవి కావు.మేలిమి బంగారం మణి మాణిక్యాలు పొదగబడిన ధగధగ మెరిసేవి.ఆయుధాల అధిదేవతల్ని రోజూ పూజించాలి.గుడిలో దాచరాదు. వాటికి ప్రత్యేకమైన ఆయుధశాల ఉంటుంది.పైగా వాటిని ఎవరికీ ఎక్కడా కన్పడని భయంకర కీకారణ్యంలో దాచాలి. అవి మెరుస్తూ ఉంటాయి.జనసంచారం ఉన్న చోటైతే సూర్య రశ్మిలో మెరుస్తూ అందరి చూపు పడి పాండవుల ఆయుధాలని తెల్సిపోతాయి. అందుకే
ధర్మరాజు ఓపెద్ద జమ్మిచెట్టుని ఎంచుకున్నాడు.
2"ఓగాండీవం! ఓభీముని గదా! మీరు ఎవరికంటా పడకుండా బందోబస్తు చేస్తాం.మీవల్ల మాగుట్టు బైటపడరాదు.చూసేవాడు భయపడి దిమ్మతిరిగి కింద పడాలి.రెండో కంటికి తెలియకూడదు.జమ్మిచెట్టు చాలా విశాలంగా విస్తరించి ఉంటుంది.కాకులు గుడ్లగూబలు గూడు కట్టి పగలు రాత్రి సందడి చేస్తూ మెలుకువ గా ఉంటాయి.పైగా ఆచెట్టు స్మశానం లో ఉంది.అసలు జమ్మిచెట్టు ఎందుకు పవిత్రమో తెలుసా?మన ఏడుకొండల వెంకన్న కులదేవత జమ్మి చెట్టు!! పద్మావతీ పరిణయంలో ఈవిషయం చెప్పాడు ఆయన.అగ్నికన్నా పవిత్రమైంది జమ్మి శమీవృక్షం.4ధర్మరాజుకి అక్కడ పడున్న దిక్కు లేని ఆడమనిషి శవం కన్పించింది.ఆ ఆయుధాల మూటకి ఆశవాన్ని
కన్పించేలాగా కట్టిపెద్దగా ఇలా అరిచాడు"ఈశవం నూరేళ్ళు నిండిన మాతల్లిది.మా కులం వంశాచారప్రకారం మేం శవాన్ని పూడ్చం  కాల్చం." 
ఆపై ఆ జమ్మిచెట్టు పైన స్వయంగా తానే ఎక్కి ఆ ఆయుధాలను శవం మూటని అమర్చాడు.ఆప్రాంతం అంతా కన్ను పొడిస్తే కానరాని చీకటి చుట్టూ బురద రకరకాల జంతు కళేబరాలతో
నానాభీభత్సంగా గుండె గుభేల్ అన్పిస్తుంది.అక్కడంతా పీనుగులు పాములే కన్పడ్తాయి.
పూర్వం రాజులు ఆయుధాగారాలను పరమపూజనీయంగా చూసేవారు.రోజూ వాటికి
శాస్త్రోక్తంగా పూజలు చేస్తారు. అగ్ని శాల అంతా పవిత్రంగా ఆయుధశాలను చూసేవారు.హంపీ విజయనగరం లో అలాంటి ఆయుధశాలను నేటికీ మనం చూడొచ్చు.దసరా అప్పుడు ఆయుధపూజ
చేస్తారు.మైసూర్ మహారాజు దర్బార్ ఇప్పటికీ కొనసాగుతోంది.మన మిలట్రీ పోలీసు శాఖలు కూడా
తమ ఆయుధాలను ఎంతో భద్రంగా దాచుకుంటారు.
శుభ్రపర్చుకుంటారు.ఇదీ మన భారతదేశం లో రక్షణ వ్యవస్థ.దైవసాయంకూడా కోరుతాం మనం.ఇదే మహాభారతం తెల్పే క్రమశిక్షణ భక్తి సమయస్ఫూర్తి.
కామెంట్‌లు