శభాష్ .. శశికళ; వెంకట్ - మొలక ప్రతినిధి



 నాన్న ఆశయం.. అక్క ప్రోత్సహిము ఉపాధ్యాయుల సహకారంతోఎలక్ట్రిసిటీ  డిపార్ట్మెంట్లో  సబ్  ఇంజనీరుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించిన శశికళసోషల్ వెల్ఫేర్ పాఠశాలలో చదువుకొని ఉద్యోగం సాధించిన చిరంజీవి "శశికళ "పై "మొలక " ప్రత్యేక కథనం.
ఆడపిల్లల్ని  చదివిస్తే  అన్నిట్లో ముందుంటారు ..అనే విషయాన్ని మరోసారి  అక్షరాల నిజం చేసింది
ఓ అమ్మాయివికారాబాద్ జిల్లా  ధరూర్ మండలం మున్నూరు సోమవారం చెందిన బోర్ర శశికళ.
వివరాల్లోనికి వెళ్తేవికారాబాద్ జిల్లా  ధరూర్  మండలం  మున్నూరు సోమవారం గ్రామానికి చెందిన బోర్ర సాయన్న ..మానెమ్మల కు ఇద్దరు కూతుర్లు ఒక అబ్బాయిఅమ్మానాన్నలు ఎంతో కష్టపడిచదివించారు.
మొదట అమ్మాయి చంద్రకళ పెద్దేముల్ మండలంలో వ్యవసాయ శాఖలో ఏఈఓ పనిచేసి ప్రస్తుతం నస్కల్ లోAEO పనిచేస్తుంది.
 చంద్రకళ  వికారాబాద్  సంగం లక్ష్మీబాయి గురుకుల లో చదివి బిఎస్సి అగ్రికల్చర్ చేసింది  రెండవ  కూతురు శశికళ
మున్నూరు సోమారంలో ప్రాథమిక పాఠశాలలో చదువుకొనికొత్తగాడి సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకొని
 పాలిటెక్నిక్ పూర్తి చేసిబీటెక్ పూర్తవుతున్న సందర్భంలోనే TSSPDC విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గా ప్రభుత్వ ఉద్యోగం సాధించింది.
తాను పడ్డ కష్టం వెనుకచిన్నప్పటినుండి అమ్మానాన్నలు ఉపాధ్యాయుల ప్రోత్సహంతో ఉద్యోగం రావడం జరిగిందని
ఆత్మీయతో శశికళ "మొలక"తో పలకరిస్తూ చెప్పింది.శశికళ మొదట వికారాబాద్ శిశు మందిర్ పాఠశాలలో ఒకటవ తరగతి వరకు చదివి,
అనంతరం మున్నూరు సోమరంలో 1 నుండి 4వ తరగతిప్రాథమిక విద్యను పూర్తిచేసుకుని5 వ క్లాస్ కు ఎంట్రెన్స్ రాసి సీట్ రావడంతో వికారాబాద్ కొత్తగాడి సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలలో  జాయిన్ అయ్యి 5 నుండి 10వ తరగతి  వరకు చదివి 
SSC లో GPA 9.0సాధించింది.ఆ సమయంలో" రమాదేవి" ఉపాధ్యాయిని సలహా మేరకుకొంపల్లి లో పాలిటెక్నిక్ కాలేజీలో 78 శాతంతో మార్కుల  తో పూర్తిచేసుకుంది. అనంతరం బీటెక్ హయత్ నగర్ దగ్గర లో  KNR కాలేజీలో చదువుతుండగానే. విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ కు నోటిఫికేషన్ రావడంతో   ఆన్లైన్లో కోచింగ్ తీసుకొని 30 రోజులపాటు ఇంట్లోనే ఉండి కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది  ప్రస్తుతం  వికారాబాద్ జిల్లా తాండూరు(TSS PDCL)విద్యుత్ శాఖ లో పనిచేస్తుంది.గురుకుల్ పాఠశాలలో మ్యాథ్స్ టీచర్" వెంకట్ రెడ్డి "సార్ స్ఫూర్తితోమ్యాస్ పై  మక్కువ పెంచుకొని ఉద్యోగం సాధించడం పట్లచాలా సంతోషంగా ఉందని
ఉపాధ్యాయులు స్నేహితులు, ప్రోత్సహంతోఅమ్మానాన్నలకు గిఫ్ట్ గా జాబ్  కొట్టానని "శశికళ" మొలక తో ఆనందాన్ని పంచుకుంది.
తను సోషల్ వెల్ఫేర్ లో చదువుతున్న సమయంలో"సమ్మర్ సమురాయ్" కార్యక్రమంలో తృతీయ బహుమతి ఐదువేల చెక్కును
అప్పటి గురుకుల సొసైటీ RS ప్రవీణ్ కుమార్,  RCO శారద మేడం చేతుల మీదుగా అందుకున్న ఆనంద క్షణాలు ఎప్పుడు మర్చిపోలేనని ఆ మధుర జ్ఞాపకంనాకు ఎంతో స్ఫూర్తి కలిగించిందనిపేర్కొంది.శశికళ అక్క చంద్రకళను స్ఫూర్తిగా తీసుకొని, తమ్ముని కూడా గురుకులాల్లో  ఇంటర్ చదివించి  డాక్టర్ చేయాలనే తపనతో NEET కు ప్రిపేర్ చేస్తున్నట్లు ఆమే పేర్కొంది.
భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి మరింత ఉన్నత స్థాయి  ఎదిగి సమాజానికి సేవలు అందించాలని తన ఆశయాన్ని నెరవేర్చుకుంటానని  ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్ళుతానంది.తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకుంది సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శశికళను "మొలక" అభినందిస్తూ అందరికీ ఆదర్శం గా ఉండాలంటూ' శశి కళ"కు
 మొలక  బాలల మాస పత్రిక తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు
కామెంట్‌లు
Ramaraghav చెప్పారు…
Heart congratulations 👏 and proud of you my der student 😍