పుస్తకాల్ని ఇష్టపడుతూ చదవాలి'- ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య

 పాఠ్యపుస్తకాలతోపాటు, విజ్ఞానాన్ని అందించే వివిధ రకాల పుస్తకాలను పిల్లలు ఇష్టపడుతూ చదవాలని కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య కోరారు. సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో మూడవ తరగతి బాలిక శనిగరపు అన్విత పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఈర్ల సమ్మయ్య గత 13 ఏళ్లుగా ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న బాలబాలికల పుట్టినరోజు వేడుకలను తన సొంత ఖర్చులతో ఘనంగా నిర్వహిస్తున్నారు.  మధ్యాహ్న భోజన విరామ సమయంలో కేక్ తీసుకువచ్చి  ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థుల సమక్షంలో అన్విత జన్మదిన వేడుకలు నిర్వహించి, సంబరాలు జరుపుకున్నారు. తర్వాత  పిల్లలకు కేక్ తినిపించి, ఆశీర్వచనాలు అందించారు. బాగా చదువుకుంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని దీవించారు. ఈ సందర్భంగా హెచ్.ఎం ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా అభ్యసన సామర్థ్యాలను పెంచుతాయన్నారు. ప్రజల సొమ్ముతో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత సౌకర్యాలతో పాటు మెరుగైన నాణ్యమైన విద్యను పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, విద్యార్థినీ, విద్యార్థులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు