న్యాయాలు -412
అర్థజరతీ న్యాయము
*****
అర్థ అనగా సగము.జర అనగా వృద్ధాప్యం. అర్థ జరతీ అనగా సగము ముదుసలి అని అర్థము.
అర్థ జరతీ అనగా శరీరములో సగభాగము వార్థక్యము అనగా ముసలితనము సగభాగము యవ్వనము కలిగియున్న స్త్రీ అని అర్థము.
అర్థ జరతీ అంటే ఏమిటీ? ఆ పదమే ఆశ్చర్యంగా ఉందే అనిపిస్తుంది ఎవరికైనా. అయితే శరీరములో కొంతభాగము వృద్ధాప్యముతోనూ మరికొంత భాగము యవ్వనముతోనూ వుండటమనేది అసాధ్యం అని చెప్పడమే ఈ న్యాయములోని ముఖ్యమైన ఉద్దేశ్యం.
తల వెంట్రుకలు నల్లగా ఉండుట చేత యువతి గానూ ,వడలిన దేహము వలన ముదుసలి గానూ వుండే స్త్రీని ఎవరూ ఆ మనిషిని రెండు రకాలుగా చూడరు.అది వయసుతో వచ్చిన మార్పు.అంతే కానీ అందువల్ల ఆమెను ఆదరణగానో,అనాదరణగానో చూడటం అవివేకం అవుతుంది.
ముఖ వర్చస్సు కళగా, అందంగా మెరిసిపోయేలా వుండటానికి పసుపు, గంధము, గులాబీ రేకులతో కూడిన రకరకాల లేపనాలు రాసి మేకప్పు వేసి కొంతమంది వయసు కనబడనీయకుండా ప్రయత్నం చేస్తుంటారు.కానీ మిగతా దేహభాగాన్ని ఏం చేస్తారు? ఒంట్లో బిగువు తగ్గుతుంది, కండరాలు ఎముకల దృఢత్వం క్రమక్రమంగా తగ్గుతూ వస్తుంది.అది ప్రతివారిలో వచ్చే సహజసిద్ధమైన మార్పు. దానికి ఎవ్వరూ అతీతులు కారు.
పుట్టిన తర్వాత తెలిసీ తెలియని బాల్యం వుంటుంది.ఊహలకు పాదులు వేసే కౌమారమూ వుంటుంది. ఆ తర్వాత అందమైన యవ్వన దశ వుంటుంది.
చిన్నప్పుడు కొంచెం అనాకారి తనంగానో, చూడటానికి బాగా లేనప్పటికీ, యవ్వనం వారిలో సరికొత్త నిగారింపు తెస్తుంది.అందుకే పెద్దలు అంటుంటారు 'వయసు వంక తీరుస్తుంది' అంటే లోపాలను పోగొడుతుందని అర్థము.
మళ్ళీ ఈ అర్థ జరతీ విషయంలోకి వద్దాం.దీనినే అంగీకారం,అనంగీకార కోణాల్లో చూడాల్సి వస్తే రెండూ తప్పే అవుతాయి.ఎవరైనా వ్యక్తి ఏదైనా విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలని లేదా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు కొంత భాగాన్ని మాత్రమే తీసుకుని, మిగిలిన దానిని వదిలి వేయడు.విషయ పరిజ్ఞానానికి సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని అధ్యయనం చేస్తాడు కదా.
అర్థ జరతులు ఎవరూ వుండరు.కాకుంటే పెరిగిన వయసును బట్టి ముదుసలి అని చెప్పడమో లేదా,చైతన్య హీనతను బట్టి వృద్ధులని చెప్పడమో వుంటుంది.
లేదంటే ఏదో ఒక మానసికమైన లోపం, అనారోగ్యం వల్ల యిబ్బంది పడే వారి ఐక్యూను గురించి చెప్పేటప్పుడు వారి యొక్క శారీరక,మానసిక వయసును అంచనా వేస్తుంటారు.అంతే కానీ దేహంలోని భాగాలను సగం ఒక విధంగా, మిగతా సగం మరో విధంగా అసలే చూడరు.
ఈ సందర్భంలో శ్రీ శ్రీ గారు రాసిన పాటను గుర్తు తెచ్చుకోవడం ఎంతైనా సముచితం.
"కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు ...అవగుణాల కుప్పలు...నూతిలోని కప్పలు"అనీ మరికొందరిని కొంత మంది యువకులు/ రాబోవు యుగం దూతలు/ పావన నవ జీవన బృందావన నిర్మాతలు " అంటారు.
అంటే యువత అంటే ఒకే విధమైన వయసున్న యవ్వనులు. వారిలో రెండు రకాల వాళ్ళు వుంటారని చెప్పేందుకే ఈ ఉదాహరణను తీసుకున్నాం.
"అర్థ జరతీ" అనేది ఉండదనీ.ఒకవేళ వుంటే ఇలాంటివి వుంటాయని చెప్పడమే ఈ న్యాయములోని ఉద్దేశ్యం.
అయితే మనం"అర్థ జరతీ న్యాయానికి" అతీతంగా మనసు, శరీరాన్ని నవ యవ్వనంగా ఉంచుకుందాం.చైతన్య స్రవంతులమై సాగుదాం.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి