న్యస్తాక్షరి;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 బా .ల . రా .మ
==============
మత్తకోకిల.
-------------
(బా)లరాముని దివ్య శోభను  భక్తులెల్లరు గాంచుచున్
కా(ల)మంతయు విస్మరించిరి కన్నులందున బాష్పముల్ 
(రా)లుచుండగ మ్రొక్కు చుండిరి రామ సన్నిధి వీడకన్
కూలిపోవును పాప రాశులు కొల్వ రా(మ)పదంబులన్ //

కామెంట్‌లు