63.
ఉత్పలమాల.
పాపపు పంకమందు బడి బావురుమంటిని శక్తి హీనతన్
తాపము తోడ బెగ్గిడితి ధైర్యము తగ్గెను గాంచవయ్య!నే
నోపగ లేక భీతిగొని నుక్కిరి బిక్కిరియై చరించితిన్
నీపద యుగ్మమున్ గొలుతు నిర్మలమౌ గతి జూపుమా హరీ!//
64.
ఉత్పలమాల.
క్లేశములెన్నియో కలుగ లేవడిగంబడి క్రుందిదీనతన్
నాశము నొందు జీవులకుఁ నర్మిలి జూపుచు కాచువాడ!నే
నాశగ నిన్ను జేరి పరమాప్తుడవంచు యజించవచ్చితిన్
కేశవ!నన్ను వెంటగొని కేలును బట్టి చరించుమా హరీ!//

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి