చెట్లను కాపాడుదాం ; సన-ఎ-నిమిదవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘణపూర్-మెదక్ జిల్లా
 అనగనగా సీతాపురం అనే గ్రామంలో గీతా,  నాగరాజు అని దంపతులు ఉండేవారు. మణిదీప్, మినాక్షి అనే కుమారుడు, కుమార్తె లు ఉండేవారు. గీత, నాగరాజు ఇద్దరూ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని నడిపించేవారు.
                 వాళ్ళ ఇంటి ముందు ఒక జామ చెట్టు ఉంది. ఎండిపోయిన జామాకులు కింద పడడం మూలంగా చెత్తాచెదారం అవుతుందని, నాగరాజు ఒకరోజు గొడ్డలితో జామ చెట్టును నరికి వేయడానికి వెళ్ళాడు. అప్పుడు మనిదీప్, మీనాక్షి ఇద్దరు వచ్చి తండ్రి నాగరాజును ఆపుతారు. చెట్లు నరకడం మూలంగా ప్రకృతి ఉండదని మా పాఠశాలలో మాస్టర్ చెప్పాడు అని అంటారు. చెట్లు ఉంటేనే మనకు ప్రాణవాయువు ఉంటుంది మనకు రక్షణ చెట్లు అని వారిద్దరు అంటారు.
                 నాగరాజు వారి మాటలు వినకుండా చెట్టును కొట్టాడు. ఒక చిన్న కొమ్మ వచ్చి నాగరాజు కంట్లో గుచ్చుకుంది. వెంటనే నాగరాజును ఆసుపత్రికి తీసుకువెళ్లగా గాయం చిన్నదే గనుక కొద్ది రోజుల్లో మానుతుందని డాక్టర్లు చెప్పారు. ఇంటి దగ్గరే ఉంటున్న నాగరాజు ప్రతిరోజు జామ చెట్టును చూసి బాధపడతాడు. తన కంటికి గాయమైతేనే ఇలా విలవిలాడుతున్నాను. మరి జామ చెట్టు కూడా ప్రాణం ఉంటుందని మనసులో అనుకుంటాడు. తాను జామచెట్టును కొట్టడం తప్పని గ్రహించి కంటి గాయం మారిన తర్వాత మణిదీప్, మీనాక్షిలతో కలిసి మరికొన్ని మొక్కలు నాటి చెట్లకు కూడా ప్రాణం ఉంటుంది. ఆ చెట్లు మనల్ని రక్షిస్తాయని చెప్పసాగాడు.
        నీతి: పచ్చని ప్రతి చెట్టును కాపాడాలి. కాని కొట్టి వేయకూడదు

కామెంట్‌లు