వారసత్వం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 భారతీయ శిల్పకళా వారసత్వం
గతప్రాభవ చిహ్నాల చిరకాల విలాసం
రాళ్ళలోన పూలుపూసిన భవ్యప్రాంగణం
శైవ వైష్ణవ ఆలయాల దివ్యసమాహారం
కాకతీయ సామ్రాజ్యపు వైభవకేతనం
శిలారణ్యం శిల్పారామంగా మారినవైనం
కఠినశిలలు వెన్నముద్దలుగా మారినవిచిత్రం
వికృతాకారాలను విలక్షణ, శిలక్షణ
శిల్పాలుగా ఉసురుపోసిన శ్రమధామం
ఏశిలలు దేవతలు దేవుళ్ళుగా మారాయో
ఏశిలలు గజ అశ్వ రథాలుగా రూపుదాల్చాయో
ఏశిలలు జంతు పక్షి గంధర్వ కిన్నెర
కింపురుష రాక్షస జాలంగా దృశ్యమానమైనాయో
ఏశిలలు నవరసాలొలికించు నాట్యగత్తెలయ్యాయో
ఏశిలలు సరిగమపదనిస రాగాలొలికిస్తున్నాయో
ఏశిలలు పత్ర పుష్ప ఫలాలుగా రూపాంతరంచెందాయో
ఆశిలలను కొట్టికొట్టి,రాసిరాసి,
గీకిగీకి,తట్టితట్టి చిన్నముక్కకూడా మిగిలకుండా
నిర్దాక్షిణ్యంగా తొలగించి అద్భుతశిల్పాలుగా
తీర్చిదిద్దిన రామప్పా! ఎంత గొప్పశిల్పివప్పా !!!
**************************************

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి కవిత. అభినందనలు ధన్యవాదములు సార్ 🌹🙏🌹👌
Joshi Madhusudana Sharma చెప్పారు…
మంచి కవిత. అభినందనలు ధన్యవాదములు సార్ ��������