ఆమ్మో ఒకటో తారీకు,
ఉద్యోగస్తులకు ఉరి కంభం ఎక్కేలాంటి రోజు
జీతం చేతిలో పడేలా వరం ఇస్తూనే,
అంతకు రెట్టింపు ఖర్చుల చిట్టా,
మధ్యతరగతి వారికి లెక్కల పరీక్షే
తీసివేతలు, కూడికలతో
మరి ఏది చేసినా మనకొచ్చే జీతం లోనే కదా!
అటు, ఇటు ఏమాత్రం తేడా వచ్చినా
నెలంతా బేజారే!
అన్నీ సర్దుకున్నాయిలే అనుకుంటే
అనుకోని అతిధుల్లా ,
ఏదో అనుకోని ఖర్చులు వచ్చి
మనసును అతలా కుతలం చేస్తాయి.
డబ్బుదేముంది, అనుకునే రోజులనుండి డబ్బులోనే అంతావుంది
అనుకునే రోజులు వచ్చాయి మరి!
అధికధరల మోతలు ఒకవైపు,
మండిపడుతున్న కూరగాయల రేట్లు ఒకవైపు
వాతావరణ కాలుష్యంతో
వింతరోగాలు మరొకవేపు
మనుషులను సతమతం చేస్తుంటే
రోజులు చక చకా తిరిగి ఇట్టే ఒకటో తారీకు వస్తే,
ఆమ్మో, ఆమ్మో, ఒకటో తారీకు అని అనుకోకుండా
L.K. G నుండే లక్షలు, లక్షలు డొనేషన్స్,
ఇక కాలేజీ పిల్లలు ఉంటే సరిసరి!
ముసలి తలి దండ్రులకు హాస్పటల్ ఖర్చులు,
ఇవన్నీ పోను మిగిలేది వందలలోనే,
మరి నెలంతా గడవాలంటే గుండెలో గుబులే మరి!
ఆమ్మో, ఒకటో తారీఖు అనుకోక తప్పదు మరి!
మనలాంటి మధ్యతరగతి జీవులం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి