శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
211)ధామః -

పరమోత్తమ స్థానమైనవాడు
జీవుల చివరిగమ్యమైనవాడు
ప్రాణులు చేరియుండువాడు
స్వర్గమను ధామమునున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
212)సత్యః -

సత్యస్వరూపము గలిగినవాడు
సత్యభావనలో నిలిచినవాడు
లోకములో సత్యాన్వేషకుడు
సత్యమే తానైనట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
213)సత్య పరాక్రమః -

సత్యనిరూపణ చేయగలవాడు
నిజమైన పరాక్రమవంతుడు
అమోఘవీరత్వముగలవాడు
సత్యసంకల్పము గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
214)నిమిషః -

నేత్రములు మూసుకొనియున్నవాడు
ధ్యానమగ్నుడై యున్నవాడు
కనులుమూసియు గ్రహించువాడు
కనురెప్పలు వాల్చినట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
215)అనిమిషః -

సదా మేల్కొని ఉన్నట్టివాడు
దేవలక్షణము గలిగినవాడు
మత్స్యరూపము దాల్చినట్టివాడు
వేలుపుగా రెప్పవాల్చనివాడు!
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు