రోహిదాసు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఒకప్పుడు కాశీలో చెప్పులు కుట్టే రఘు అనే భక్తుడు రాత్రి పూట రాజు కొలువులో కాపలాదారు గా పనిచేసేవాడు.దైవానుగ్రహంతో అతనికి కొడుకు పుట్టాడు.ఆతనే రోహిదాసు.పుట్టినతర్వాత అస్సలు ఏడ్వలేదు ఆశిశువు.పాలుకూడా తాగలేదు.ఆపసివాడిలో ఓదివ్యతేజస్సు.పిల్లాడు పెరిగి పెద్ద అయ్యాడు కానీ కులవృత్తి అంటే జంతుచర్మాలతో చెప్పులు కుట్టడం అతనికి ఇష్టం లేదు.కానీ గుర్వానతితో రామనామ స్మరణ చేస్తూ కులవృత్తి చేయసాగాడు.తండ్రికి అనారోగ్యం గా ఉంటే ఆరోజు రాజభవనం కాపలాదారు గా వెళ్లి దేవుని స్తోత్రాలు చదవసాగాడు.నిద్రాభంగమైన రాజు రాణి రోహిదాసుని పిల్పించారు.అతను పాడిన పాటలకు రాజు ఆనందించాడు.కొందరు అసూయాపరులు అతని ఇంటి కిటికీ లోంచి తొంగి చూశారు.చర్మంతో చేసిన దైవం చిత్రం ని రోహిదాసు పూజించడంచూసి" నీ నీచబుద్ధి పోలేదు.దేవుని చర్మంతో చేశావా?" అని ఎద్దేవా చేశారు.అతను ఇచ్చిన జవాబిది" మన శరీరం చర్మం.ప్రాణంపోయాక దేనికీ ఉపయోగపడదు.జంతుచర్మాలతో డోలు మద్దెల తయారు అవుతున్నాయి." అనగానే వారు సిగ్గుపడతారు.భార్యా పిల్లల్ని పోషించడం కోసం చెప్పులు కుడ్తూనే దైవ స్మరణ లో లీనమయ్యేవాడు.ఒకసాధువు పరశువేది ఇచ్చినా దానితో బంగారం ఆశించక తిరిగి ఆసాధువుకే ఇచ్చేశాడు.గంగాస్నానం చేసి సాధువు ఇచ్చిన సాలగ్రామం పూజించేవాడు.పూజ పూర్తి కాగానే సాలగ్రామం దగ్గర ఒక బంగారు నాణెం కన్పడేది. దానితో బీదలకు అన్న వస్త్రాలు దానం చేసేవాడు.రాజుకి ఈవిషయం తెల్సి ఆసాలగ్రామంని బలవంతంగా తన రాజమందిరంలో పెట్టుకున్నాడు.రోహిదాసు కన్నీరుమున్నీరుగా రాత్రంతా దైవం ముందు ఏడుస్తూ కూచున్నాడు.తెల్లారినాక రాజు పూజ చేయాలి అని పూజా మందిరంలో కెల్తే అదిలేదు.రోహిదాసు ఇంట ప్రత్యక్షమైంది.రాజు పశ్చాత్తాపంతో కుంగిపోతాడు.ఇలా జీవితాంతం రోహిదాసు నిత్యసమారాధన భగవంతుని సేవలో తరించి ఆదైవంలో లీనమైన ధన్యజీవి 🌷
కామెంట్‌లు