గుణాత్మకత విద్యాసాధన మనందరి లక్షం



 పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థుల గుణాత్మక విద్యాసాధనకు మనమంతా శ్రమించి, సత్ఫలితాల దిశగా కృషి చేయాలని మండల లిప్ టీమ్ సభ్యులు అన్నారు. ఉప విద్యాశాఖాధికారి పర్రి కృష్ణమూర్తి నేతృత్వంలో పాలకొండ మండల లిప్ టీమ్ మానిటరింగ్ లో భాగంగా వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను లిప్ పర్యవేక్షక బృంద సభ్యులు సందర్శించారు. 
తనిఖీ బృంద సభ్యులు 
బౌరోతు మల్లేశ్వరరావు, అప్పికొండ రాంబాబు, తందాడి అనిల్ కుమార్, తామాడ సూర్యనారాయణలు 
అభ్యసనాభివృద్ధి కార్యక్రమం అమలగుచున్న తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. బేస్ లైన్ టెస్ట్ పేపర్లను, పాఠ్య పథక రచనలను, ఉపాధ్యాయుల డైరీలను, లిప్ రిపోర్ట్స్, పాఠశాల అసెంబ్లీ తదితర రికార్డులను పరిశీలించారు. పాఠశాల, పరిసరాల మరియు టాయిలెట్ల పరిశుభ్రత, మధ్యాహ్న భోజన పథకం, మంచినీటి సౌకర్యం, మొక్కల పెంపకం అమలు తీరును పరిశీలించారు.
విద్యార్థుల వర్క్ బుక్స్, నోట్ బుక్స్ ను తనిఖీ చేసి, వారి సామర్ధ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల పాఠ్యబోధనలను పరిశీలించారు. పాఠశాల కార్యక్రమాలు, లిప్ అమలు తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేసారు. పాఠశాల ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి, ఉపాధ్యాయులు పాలవలస శారదాకుమారి, గోగుల సూర్యనారాయణ, దానేటి పుష్పలత, సిద్ధాబత్తుల వెంకటరమణ, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
కామెంట్‌లు