హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో గులాబీల మల్లారెడ్డి పుస్తకాల ఆవిష్కరణ
 హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్ లో శనివారం రచయిత గులాబీల మల్లారెడ్డి జీవితం సాహిత్యం పై ప్రచురించిన పాలపిట్ట ప్రత్యేక సంచిక,ఇతర పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా నేను,ప్రముఖ రచయిత ఏనుగు నర్సింహరెడ్డి,గుడిపాటి,ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్,రచయిత్రి బండారు విజయ,అరసం నాయకులు ఆనంద్,ఏలేశ్వరం వెంకటేశ్,పి.నారాయణ రెడ్డి తదితరులతో… ఈ సందర్భంగా సమావేశ వేదిక వద్ద ఇంకా మిత్రులు అరసం జాతీయ అధ్యక్షులు పెనుగొండ లక్ష్మీ నారాయణ,ఈశ్వర రెడ్డి,ప్రముఖ సీనీ కవి సుద్దాల అశోక్ తేజ,జూలూరి గౌరీశంకర్,జయరాజు,తదితరులతో కలిసి సాహీతీ విషయాలు ముచ్చటించుకోవడం జరిగింది.బుక్స్ ఎగ్జిబిషన్ లో అనేక పుస్తక స్టాల్సు తిరగి చూడడం జరిగింది.కొన్ని పుస్తకాలు కొనుక్కోవడం జరిగింది.పుస్తక ప్రపంచంలో ఎక్కడా చూసినా పుస్తక ప్రియులే జనసముద్రంగా కనబడ్డారు.ఇది మరచిపోలేని గొప్ప అనుభూతి…. -వేల్పుల నారాయణ.


కామెంట్‌లు