ద్రోణుడు _ ధర్మరాజు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో ద్రోణ పర్వంలో ధర్మ రాజు ని అగ్గగ్గలాడించిన వాడు గురువు ద్రోణాచార్యుడు.ధర్మరాజు ఆయన ధాటికి ఆగలేక యుద్ధ భూమిలోంచి పారిపోయాడు.దుర్యోధనుడు ద్రోణునికి సర్వసైన్యాధిపత్యం అప్పగించి " మీరు ఎలాగైనా ధర్మరాజుని పట్టి బంధించి నాదగ్గరకు ఈడ్చుకుంటూ తేవాలి.జూదంలో ఓడించి తిరిగి పాండవులని అడవికి పంపుతాను.యుద్ధం ఆగుతుంది.నేనే రారాజుగా ఉంటాను" అన్నాడు.
తనకి ఆపదలో ఇచ్చినందుకు సంతోషం తో ద్రోణుడు మాట ఇచ్చాడు.అంతే ఆయన పాట్లు మొదలైనాయి.అర్జునుడిని దూరం గా తరిమేసే బాధ్యత ను దుర్యోధనుడి పై పెట్టి చెలరేగిన ద్రోణుని ధాటికి తట్టుకోలేక పాండవసైన్యం కకావికలం ఐంది.కానీ ద్రోణుడు నిష్కల్మషంగా ప్రేమ ఆప్యాయత తో అర్జునుడికి కవచధారణ విద్య నేర్పాడు.పద్మవ్యూహం ఛేదించటం నేర్పాడు.కానీ ధర్మరాజుని పట్టుకొనే అవకాశం చేజిక్కలేదు.అభిమన్యుడు దుశ్శాసనుడికొడుకు ఒకేసారి చంపబడ్డారు.పద్మవ్యూహం ముడుచుకున్న పద్మం లాగా ఉంటుంది.పద్మం విచ్చుకున్నప్పుడుతుమ్మెదలు అందులో దూరి మకరందం తాగి నిద్ర, పోతాయి.అంతే! అది ముడుచుకుని పోతే తుమ్మెద బైటికి రాలేక అందులో నే చచ్చి పడి ఉంటుంది.అలా ద్రోణుని వ్యూహం తో
ధర్మరాజు నిస్సహాయంగా ఉన్నాడు.కృష్ణుడు సలహా ఇచ్చాడు "అశ్వత్థామ చచ్చాడు అని చెప్పు' అని.కానీధర్మరాజు అశ్వత్థామ హతః అని ఏనుగు అని నెమ్మదిగా గొణిగాడు.తన కొడుకు అశ్వత్థామ చనిపోయాడు అని నమ్మి ద్రోణుడు అస్త్రసన్యాసం చేయటంతో ధర్మరాజు ప్రాణాలు దక్కాయి.ధర్మం న్యాయం దైవ కృప ఉంది అని తెలిసీ ద్రోణుడు పాండవుల తో యుద్ధం చేశాడు.ద్రోణుని ఎదుట
పితృదేవతలు  ఋషులు ప్రత్యక్షమై" నీవు బ్రాహ్మణుడివి.భారద్వాజ మహర్షి కొడుకువి.పాండవులు శిష్యులు అంటే నీకొడుకులతో సమానం.ధర్మం పాండవుల వైపు ఉంది" అని కూడా హెచ్చరించారు.కానీ కౌరవుల కొలువులో ఉండి తన విశ్వాసం చాటాడు ద్రోణుడు
కామెంట్‌లు