భక్త నందనార్! అచ్యుతుని రాజ్యశ్రీ

 బాలశివభక్తుడు  నందనార్.కావేరీతీరంలో తంజావూర్కి దగ్గరున్న ఆదనూర్ అనే పల్లెలో మాలవాడలో పుట్టాడు.పొలంపనులు పశుపోషణ చనిపోయిన జంతువులను పాతిపెట్టడం అతని వృత్తి.బాల్యంలోనే శివభక్తితో నదిలో స్నానం చేసి విభూతి ధరించి హరహరశంభో అని సదా ధ్యానం చేసే వాడు.గుడిలోకి రానిచ్చేవారుకాదు గనుక మట్టితో శివలింగం చేసి పూజించేవాడు.ఆదనూర్ కి10మైళ్లదూరంలో తిరుప్పుంగూర్ అనే గ్రామంలో శివాలయం చూడాలని వెళ్లాడు.తక్కువకులంవాడని గుడిలోకి రానివ్వరు.ధ్వజస్థంభందగ్గర నిలబడి ఆర్తితో ఏడుస్తూ శివస్తుతి చేస్తాడు.భక్తవశంకరుడు శివుని మహిమ తో నందీశ్వరుని విగ్రహం పక్కకు జరిగింది.సరాసరి శివుని కాంచి ఆనందంతో గంతులేస్తాడు నందనార్.ఆగుడి ఎదురుగా చిన్న నీటి గుంట కన్పడ్తే నాతోటి పిల్లలతో కల్సి చెరువుని తవ్వాడు.శివానుగ్రహంతో ప్రమధగణాలు ఆచెరువుని పూర్తి చేశాయి.అలాగే చిదంబరం లో నటరాజ స్వామి దేవాలయం చూడాలని తహతహలాడాడు.కానీ అతని యజమాని ఓషరతు పెట్టాడు.మూడురోజుల్లో పొలం దున్ని పంటపండించి ధాన్యం ని ఇంటికి చేర్చమంటాడు.అది అసాధ్యం.కానీ నందుడు అహోరాత్రులు శివ స్మరణ చేస్తూ ఏడుస్తూ ఉంటే స్వయంగా శివుడే తనపరివారంతో వచ్చి మూడు రోజుల్లో పంటపండించి ధాన్యం యజమాని ఇంటికి చేరుస్తాడు.యజమాని కి నందనార్ బాలప్రహ్లాదునిలాగా కనిపిస్తాడు.నందనార్ చిదంబరం చేరి నటరాజ స్వామి దేవాలయం కి వెల్తే లోపలికి రానివ్వరు.అగ్నిలో దూకి ఆహుతి కావడం మేలని మంటల్లో దూకడం మంటలు ఆగిపోయి ఓపూలమాల అతని మెడలో పడటంతో జనమంతా జేజేలు పలికారు.అలా గర్భగుడిలో కి ప్రవేశించి నటరాజ స్వామి దర్శనం చేసుకుని పునీతుడైనాడు.వెంటనే అతని ప్రాణాలు పోయాయి.ఆయన భౌతికకాయాన్ని సమాధి చేశారు.భక్తికి దైవారాధన కి కులంతో పనిలేదు అనేది సత్యం.అలా మనదేశంలో అంటరానితనం నిర్మూలనమై హరిజనులకు దేవాలయప్రవేశం కల్పించారు మన జాతీయ నాయకులు 🌷
కామెంట్‌లు