సౌందర్యలహరి;- కొప్పరపు తాయారు
 🌟శ్రీశంకరాచార్య విరచిత🌟

పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే
నిషంగౌ జంఘే తే విషమవిశిఖో బాఢమకృత ।
యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగలీ-
నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశాణైకనిశితాః ॥ 83 ॥

శ్రుతీనాం మూర్ధానో దధతి తవ యౌ శేఖరతయా
మమాప్యేతౌ మాతః శిరసి దయయా ధేహి చరణౌ ।
యయోః పాద్యం పాథః పశుపతిజటాజూటతటినీ
యయోర్లాక్షాలక్ష్మీరరుణహరిచూడామణిరుచిః ॥ 84 ॥
83) అమ్మా! గిరి పుత్రికా! ఐదు , బాణములు కల మన్మధుడు రుద్రుని జయించుటకు తన బాణములు సరిపోవని తలచి, నీ పిక్కలను అంబుల పొదిగా చేసుకుని, కాలి వ్రేళ్ళను బాణములుగా చేసుకుని,
గోళ్ళను బాణముల చివరనున్న ఉక్కు ముక్కలుగా చేసుకొనెను. నీకు నమస్కరించు దేవతల కిరీటముల ఒరిపిడికి గోళ్ళు చివరి భాగములు అరిగిపోయి పదును పెట్టినవిగా ఉన్నవి కదా తల్లీ!
84) అమ్మా !వేదములైన నీ శిరస్సు నందు ఉపనిషత్తులు సిగలో పువ్వులుగా
 ధరింపబడినవా! శివుని జటాజూటము నందలి గంగాజలముతో పాద ప్రక్షాళన కొరకు  ఉపయోగించునవియు విష్ణు యొక్క కౌస్తుభ కాంతులే లత్తుకగా గల నీ పాదములను నా శిరస్సునందు దయతో ఉంచుము తల్లీ!
                 ****🪷**
🪷 తాయారు 🪷


కామెంట్‌లు