'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 41.
ఉత్పలమాల.
మోపరి కాడవై గిరిని మోసితి వాహ!కనీనికంబుతోన్
గాపరివై ధరాతలముఁ గ్రాలగ నిల్పితి వీవు శౌరి! సం
తాపముఁ దీర్పరావ! పరతత్త్వమెఱుంగని బేలనైతి నా
పాపముఁ లెక్కవేయకుమ!భారము నీదని మ్రొక్కితిన్ హరీ!//
42.
చంపకమాల.
దొరవని గొల్లెతల్ మురిసి కోపులు పెట్టుచు గౌరవింపగన్
దరికొని తీర్చి కోరికలు దాలిమితో చరియించి తోడుగన్
గిరులను మోసి కాచి బహు కీర్తిని పొందితి వయ్య !శౌరి!నే
పొరలుచు దండముల్ పెడుదు పుణ్యమొసంగుము ప్రీతిగన్ హరీ!//

కామెంట్‌లు