సౌందర్యలహరి ;- కొప్పరపు తాయారు
  🌟 శ్రీ శంకరాచార్య విరచిత🌟

గురుత్వం విస్తారం క్షితిధరపతిః పార్వతి నిజా-
న్నితంబాదాచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే ।
అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీం
నితంబప్రాగ్భారః స్థగయతి లఘుత్వం నయతి చ ॥ 81 ॥

కరీంద్రాణాం శుండాన్ కనకకదలీకాండపటలీ-
ముభాభ్యామూరుభ్యాముభయమపి నిర్జిత్య భవతీ 
సువృత్తాభ్యాం పత్యుః ప్రణతికఠినాభ్యాం గిరిసుతే
విధిజ్ఞ్యే జానుభ్యాం విబుధకరికుంభద్వయమసి ॥ 82 ॥

81) అమ్మ మీ నాన్నగారైన కళ్యాణ సమయంలో తన పర్వత స్థానాల నుండి విశేష మైన గురుత్వాన్ని విస్తారాన్ని తెచ్చి నీకు ఆభరణంగా ఇచ్చారు. అందుకేనేమో భవదీయ తనితంబు భారం మరింత ముందుకు వంగి భూప్రదేశాన్ని  ఆఛ్ఛాధితం  చేస్తుంది. అందువల్ల విశాలంగా ఉన్న భూమి నీ ముందర చిన్నదిగా అయిపోయింది కదా తల్లీ!
82)
    అమ్మా !హిమగిరి తనయా !ఏనుగులు యొక్క తొండములను బంగారు అరటి చెట్ల కాండములను, నీదగు రెండు ఉరువులచే, ఏనుగు తొండములు ,అరటి కాండములు, ఓడించబడుతున్నాయి కదమ్మా ! 
నీవు భక్తితో నీ విధి ననుసరించి ఆ.పరమశివునకు మొక్కుటచే భూస్పర్శ వలన బిరుసువారిన మోకాళ్ళుచేత.ఏనుగు కుంభములను 
కూడా ఓడించు చుచున్నావు కదా తల్లీ !
              ***🌟***
🪷 తాయారు 🪷

కామెంట్‌లు