శ్రీ విష్ణు సహస్రనామాలు ;- (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
251)శుచిః -

శుద్ధిని కలిగించినవాడు
శుచియైన పవిత్రమైనవాడు
పావనిగానున్నట్టివాడు 
శుచిమహిమలు తెలుపువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
252)సిద్ధార్థః -

పొందదగినది పొందినవాడు
అనుకున్నట్టు సాధించినవాడు
కామ్యములు సిద్ధించువాడు
అనుగ్రహం అందించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
253)సిద్ధసంకల్పః -

కోరికలు నెరవేర్చగలవాడు
సంకల్పసిద్ధిజేయగలవాడు
ప్రయత్నం నెరవేర్చువాడు
సహకరించగలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
254)సిద్ధిదః -

జీవులకర్మలచూచువాడు
కర్మానుసారము నడిపించేవాడు
కర్మఫలం అందించువాడు
ఫలితం సిద్ధింపగలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
255)సిద్ధిసాధనః -

కార్యసిద్ధిచేయగలవాడు
సిద్ధిసాధనoదించువాడు 
అనుకూలము చేయునట్టివాడు 
సాధనసంపత్తితానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు