ధర్మరాజు యుద్ధ సన్నాహాలు!-అచ్యుతుని రాజ్యశ్రీ

 కురుక్షేత్రం లో యుద్ధం ప్రారంభం కాబోతోంది.ధర్మరాజు
అర్జునుడి తో అంటాడు " కంటిరెప్పలాగా మనసైన్యంని నీవు కాపాడు.మనలందర్నీ శ్రీకృష్ణుడే కమ్ముకుంటాడు. ఆయన్ని నమ్మిన వారికి శరణం అన్నవారిసంగతి బాధ్యత ఆయనే చూస్తాడు.ద్రోణుడు యుద్ధానికి వస్తే నీవు నన్ను కాపాడాలి" అని సూచించి " నీకు రక్ష కృష్ణుడే! రథసారథి గా నిన్ను కాపాడు తాడు" అని పితృదేవతల ఆశీస్సులు పొందాడు.కుడికన్ను అదిరింది.గెలిస్తే రాజ్యలక్ష్మి  ఓడితే స్వర్గలక్ష్మి! అందరికీ పూలు పళ్లు  భక్ష్యాలు పంచాడు.సైన్యం అంతా కానుకలు స్వీకరించి ఉత్సాహం ఉల్లాసం గా ఉంది.యుద్ధభూమిలో  ధర్మరాజు తన ఆయుధాలు కవచాలు తీసి రథంలో పెట్టి మౌనంగా కాలినడకన ఎదురుగా కనిపిస్తున్న భీష్మాది పెద్దలను సమీపించాడు.రెండు చేతులు జోడించి " తాతా! నాకు విజయం కలిగేలా ఆశీర్వదించండి" అన్నాడు. " నీవు నాదగ్గరకు రాకుంటే శపించేవాడిని. ధర్మం గెలుస్తుంది.నాకు విసుగు బతుకు మీద విరక్తి పుడితే చెప్తాను నన్ను ఎలా గెలవాలో!"
అలాగే ద్రోణుని ఆశీస్సులు అందుకున్నాడు." కృష్ణుడు ఉండగా నీదే జయం ధర్మరాజా"! ఆపై కృపాచార్యుడు అన్నాడు" నీవున్న చోటు ధర్మం గెలుస్తుంది.నాకు చాలు లేదు.శల్యునికి నమస్కరించి "కర్ణుని ఎత్తి పొడుపు మాటల్తో నిస్సహాయుడిని చేయండి." అని వారందరికీ భక్తి శ్రద్ధలతో నమస్కరించి యుద్ధం ప్రకటించాడు ధర్మరాజు 🌷
కామెంట్‌లు