శల్యుడు _ సంజయుడు! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో ముఖ్యంగా రెండు పాత్రలు కౌరవ పాండవులతో స్నేహం గా ఉంటూ తమ మాటకి కట్టుబడి ఉన్నాయి.ఒకసామెత ఉంది" శల్యసారధ్యం అని.ఒకరి పక్షాన జైజై అంటూ రెండో పక్షం కి సాయం చేసే కుటిలచతురులు నేడు కూడా మనకు కన్పిస్తారు.మనవారిగానే నటిస్తూ మన శత్రువుకి సాయం చేస్తారు.అలాంటివాడు శల్యుడు.మద్రదే రాజు మాద్రి సోదరుడు.నకులసహదేవులకు స్వయానామేనమామ.పాండవపక్షపాతి.కాకపోతే ఆయనకో బలహీనత ఉంది.తనని ఎవరైనా పొగిడితే తెగ ఉబ్బి తబ్బిబ్బు ఐపోయి వారేది కోరితే అది వెంటనే ఇచ్చేస్తాడు.
2ఉపప్లావ్యంలో ఉన్న వారికి సహాయపడాలి అని సైన్యం తో బైలుదేరాడు.ఇదితెల్సిన దుర్యోధనుడు చాలా తెలివిగా శల్యుని బుట్టలో వేశాడు.ఎందుకంటే రథసారధ్యంలో కృష్ణునితో సమానంగా రథం నడిపేవాడు ఒక్క శల్యుడు మాత్రమే.బండీ తోలేవాడు సరిగ్గా నడపకపోతే బోల్తా పడుతుంది కదా? అందుకే దుర్యోధనుడు శల్యుడు అతని సైన్యం వచ్చే దారులన్నీ శుభ్రంగా అలంకరించి ఎదురేగి బ్రహ్మాండంగా స్వాగతం పలికాడు." మామా! నీవు మా పక్షాన యుద్ధం చేయాలి.కర్ణుని రథసారథి గా ఉండాలి" అనేప్పటికి బోల్తా పడి అలాగే అని మాటఇచ్చేశాడు.ఇప్పుడు పాండవుల దగ్గరకు బైలుదేరాడు.
3 ధర్మరాజు కి శల్యుని దౌర్బల్యం బలహీనత తెలుసు.కాస్త పొగిడ్తేచాలు‌ ఉబ్బి తబ్బిబ్బు ఐపోయి వరాలు కోరుకో అన్నాడు."మామా! మీరు దుర్యోధనుడికి మాట ఇచ్చేశారు.రథసారథి గా ఉంటానని.కర్ణుని రథం తోలేటప్పుడు మాత్రం
మాటల్తో అతన్ని హింసించి మానసికంగా అతన్ని కృంగి పోయేలా చెయ్యి.అర్జునుడ్ని ఎదిరించే మొనగాడు అతనొక్కడే.అతనంటేనే నాకు జంకుగా ఉంది.మీ మాట నిలబడుతుంది." అంతే! అలాగే నని మాటిచ్చాడు శల్యుడు.పాపం రథం ఎక్కింది మొదలు కురుక్షేత్రం లో కర్ణుని నీచాతినీచంగా మాటల్తో కుళ్ళబొడిచాడు. 
మనం కూడా టెన్షన్ లో ఉన్నప్పుడు ఎవరైనా " ఫర్వాలేదు.మేమున్నాం.నేను కావాల్సిన సాయం చేస్తాను.దిగులు పడకు" అని మాట సాయం అన్నా చాలు.కొండంత ధైర్యం వస్తుంది.అందుకే పరీక్షల ముందు పిల్లల్ని చదువు పేరుతో ఒకటికి వందసార్లు రుబ్బిస్తే వారు పూర్తిగా మర్చిపోతారు.లాజిక్ గా నేర్పాలి.ఫర్వాలేదు.మార్కులు గ్రేడ్ కాదు.తర్కంగా ఆలోచించి స్వంతంగా రాయటం నేర్పాలి సుమా!
కామెంట్‌లు