మానవతా మూర్తి! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఆచిన్నారి తాతనుండి ధైర్యసాహసాలు దేశభక్తి పుణికి పుచ్చుకున్నది.తండ్రి దయాదాతృత్వం తల్లి వినయం విధేయత అబ్బాయి.గుడిసెవాసులకి తగిన సాయం చేసేది చిట్టితల్లి.తండ్రి కేవలం 34వ ఏటనే చనిపోవటం దురదృష్టం.భార్యతో " మనపాప మంచి
సంఘసేవిక అవుతుంది.ఆమె ఏప్రాంతానికి వెళ్తానన్నా అడ్డగించకు" అని మాట తీసుకుని కన్నుమూశారు.తల్లి పుట్టిల్లు చేరి ఇద్దరు కూతుళ్లను కష్టపడి చదివించింది.17 ఏళ్ల వయసులో చిన్న పిల్లలకు అధ్యాపకురాలిగా కెరీర్ ప్రారంభించిన ఆమె
స్వంతంగా బడి నడిపింది.ఇంజనీర్ యువకుడితో పెళ్లి నిశ్చయం కావడం అతను అనారోగ్యంతో చనిపోటంతో ఆమె నిరాశ దుఃఖం లో మునిగి పోయింది.సరిగ్గా ఓభారతీయసాధువు పరిచయంఆమెను ఆధ్యాత్మికచింతన పెరిగి  ఆయన చూపిన బాటలో ప్రయాణం సాగించింది.మహిళలు చదువు వారి అభ్యున్నతికై తన జీవితం
ధారపోసింది." భారత్ కి ఆడసింహం కావాలి" అని " ఏనుగు దంతం బైటికి వచ్చాక ఎలా వెనక్కి వెళ్ళదో ఆలా మాట వెనక్కి తీసుకోరాదు" అనే గురువు గారి సందేశం తో ఓగట్టినిర్ణయం తీసుకుందామె.ఆమెతో శివారాధన పూజ చేయించిన గురువు ఆనతితో 
ఇంటింటి కెళ్ళి ఆడపిల్లలని బడికి పంపమని నచ్చజెప్పిన ఆమె వారికి చిత్ర శిల్ప కళలు ఆటపాటలు నేర్పి మంచి అధ్యాపకురాలిగా పేరు గడించారు. కలకత్తా లో ప్లేగువ్యాధి వచ్చినపుడు మురికివాడల్ని శుభ్రం చేయడం రోగుల సేవ చేయడంలో నిమగ్నమై జబ్బు పడింది.తాను పాలు తాగడం మానేసి ఆడబ్బుతో రోగికి మందులు కొనేవారు.యూరప్ అమెరికాలలో పర్యటించి హిందూ సంస్కృతి హిందూధర్మం గూర్చి ప్రచారం చేసి 
భారతదేశం అంటే ఉన్న అపోహల్ని పోగొట్టారామె.
1902 లో ఆమె తన గురువు నా చూడాలి అని వెళ్ళారు.జులై 2 ఏకాదశి రోజు.గురువు స్వయంగా ఆమె కి అన్నం వడ్డించి ఆమె చేతులు కడగడం అపూర్వం.ఆయన ఉపవాసం ఉన్నారు.ఆయన ఆశీస్సులు తీసుకుని ఇంటికెళ్ళి పోయారు ఆమె.జులై 3 గురువు గారు మహాసమాధి చెందడం
అంతిమయాత్ర లో ఆమె పాల్గొనటం ఆమె మనసుని విషాదం లో నింపాయి." అమ్మా! భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో నీవు సమిథవు కావాలి" అన్న గురువు గారి మాటలు తు.చ.తప్పక పాటిస్తూ వందేమాతరం నా బడిలో ప్రార్థనాగీతంగా పాడిస్తూ
పిల్లల చేత రాట్నం వడికించి ఖద్దరు దుస్తులు ధరించారు.ఆనాటి రాజకీయ ప్రముఖులు ఈమెను కలిసేవారు.బెంగాల్ విభజన కరువు వరదలప్పుడు ఆమె చేసిన సేవలు అపూర్వం అద్వితీయం.1905 అక్టోబర్ 13 వతేదీన డార్జిలింగ్ లో ఆమె అన్న ఆఖరి మాటలు ఇవి"చుక్కాని లేని నాజీవితనౌక ఇంకాసేపట్లో మునిగి పోతుంది.కానీ భారత్ కి ఉజ్వల భవిష్యత్తు ఉంది." హిమాలయ సానువుల్లో ఆమె సమాధి చేయబడింది.సర్.జగదీశ్ చంద్రబోస్
ఆమెకు నివాళిగా కాగడాపట్టుకున్న ఓస్త్రీమూర్తి విగ్రహంని ప్రతిష్ఠించారు...ఆమమతామూర్తి సోదరి(సిస్టర్) నివేదిత. ఆమె గురువు స్వామి వివేకానంద.ఐర్లాండ్ కి చెందిన మార్గరెట్ నోబుల్.నివేదిత అంటే సమర్పణ అని అర్థం 🌷
కామెంట్‌లు