ఇంజనీర్ రత్నలక్ష్మికి మహతి సాహితీ చక్రవర్తి బిరుదు ప్రదానం

 మహతి సాహితీ కవి సంగమం - కరీంనగర్ కవన వేదిక వారు వంద కవితల పండగ మరియు మాతృభాషా దినోత్సవ కవిసమ్మేళనం ఆదివారం  హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాలకు చెందిన జలవనరుల శాఖలోని తెలుగుగంగ ప్రాజెక్టులో అసిస్టెంట్ ఇంజనీరుయైన ఎస్. రత్నలక్ష్మి ఈ కవితల పండుగలో పాల్గొని రత్న మయూఖాలు పేరుతో అద్భుతమైన సాహిత్య భావపటిమతో 100 కవితలను దిగ్విజయంగావిరచించారు. ఈ సందర్భంగా ఎస్. రత్నలక్ష్మి సాహితీ ప్రతిభ మరియు ప్రజ్ఞ పాటవాలను గుర్తించి మహతి సాహితి కవిసంగమం వ్యవస్థాపక అధ్యక్షులు మరియు నిర్వాహకులైన డా. అడిగొప్పుల సదయ్య, ముఖ్య గౌరవ అతిథి తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులైన డా. నందిని సిద్ధారెడ్డి, గౌరవ అతిథులైన శ్రీ నాగేశ్వరం శంకరం, మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టరేనా శ్రీ ఏనుగు నరసింహారెడ్డి మరియు సమూహ నిర్వాహకులు సమీక్షకులు ఎస్. రత్నలక్ష్మికి మహతి సాహితీ చక్రవర్తి అనే బిరుదును ప్రదానం చేస్తూ, అందమైన జ్ఞాపిక మరియు బిరుదు ప్రదానపత్రంతో సన్మానించారు ఈ సందర్భంగా విశిష్ట అతిథులు, సహకవులు, కవయిత్రులు, పురప్రముఖులు మరియు బంధుమిత్రులు రత్నలక్ష్మికి అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు