'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 31.
ఉత్పలమాల.
జోజొ ముకుంద!యంచు దలి జొబ్బిలు ప్రేముడి నిద్రబుచ్చ నీ
తేజపు రూపమున్ గనుచు దేవత లెల్లరు సొక్కుచుండి నీ
పూజలు సల్పితాము బహు పుణ్యముఁ బొందిరి శేషశాయి!నీ
భ్రాజితమౌ పదంబు గన భక్తిగ వేడితి నయ్య!శ్రీహరీ!//
32.
ఉత్పలమాల.
మన్నును మ్రింగి విశ్వమును మాతకు జూపిన దివ్యరూప!నిన్
గన్నుల గాంచు వారలకు కామ్యము లన్నియు తీరిపోవు సం
పన్నత తోడ గేహములు వర్థిలుచుండ శుభంబు కల్గుతన్
జెన్నుగ నీపదంబులకు సేవలు సల్పెద నిష్ఠగన్ హరీ!//

కామెంట్‌లు