సౌందర్యలహరి; కొప్పరపు తాయారు
🌟 శ్రీ శంకరాచార్య విరచిత🌟

అరాలైఃస్వాభావ్యాదలికలభసశ్రీభిరలకైః
పరీతం తే వక్త్రం పరిహసతి పంకేరుహరుచిమ్ ।
దరస్మేరే యస్మిన్ దశనరుచికింజల్కరుచిరే
సుగంధౌ మాద్యంతి స్మరదహనచక్షుర్మధులిహః ॥ 45 ॥

లలాటం లావణ్యద్యుతివిమలమాభాతి తవ య-
ద్ద్వితీయం తన్మన్యే మకుటఘటితం చంద్రశకలమ్ ।
విపర్యాసన్యాసాదుభయమపి సంభూయ చ మిథః
సుధాలేపస్యూతిః పరిణమతి రాకాహిమకరః ॥ 46 ॥
45) అమ్మా! వంకర స్వభావం కలిగి, నల్ల తుమ్మెదలా కాంతి వంటి కాంతి కలిగిన ముంగురు లచే చుట్టుకున్న నీవదనము తామర పూవును హేళన చేయుచున్నది.చిరునవ్వుకలిగిన నీవంటి
అందములతో నిండి సువాసనకలదియు ,అయిన
ఆ ముఖమును మన్మధుని సంహరించిన ఆ శివుని
నేత్రములు తుమ్మెదలు మోహపడుచున్నవి కదా ! తల్లీ,!

46) అమ్మా! లావణ్యమయిన వెన్నెల కాంతి చే నిర్మలమయిన నీ లలాటము యొక్క కొసలను రెండవ చంద్ర ఖండముగా నే భావింతును. ప్రథమ ఖండమని నీ కిరీటము నందు ఉన్నది. రెంటినీ కలిపి చూసిన అమృత పూత  కలిగిన పౌర్ణమి నాటి చంద్రునిగా పరిగణించు చున్నవి కదా! తల్లీ!
                      ***🌟***
🌟 తాయారు 🪷

కామెంట్‌లు