విద్యా వ్యవస్థలో ప్రక్షాళన;- సి.హెచ్.ప్రతాప్

 పండిత మదనమోహన మాలవ్యా స్వాతంత్య్ర సమరంలో గొప్ప దేశభక్తుడు. వందేళ్ల క్రిత మే విద్య ఆవశ్యకతను గుర్తించాడు. అందుకోసం దేశమంతా తిరిగి చందాలు పోగుచేసి కాశీలో బనారస్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు. మాలవ్యాకు తెలియకుండా ఆయన సమీప బంధువు ఒకరిని ఆ విశ్వవిద్యాలయ అధికారులు ఓ పెద్ద ఉద్యోగంలో నియమించారు. ఈ విషయం తెలిశాక మాలవ్యా డా.రాధాకృష్ణన్‌కు లేఖ రాసి ‘వెంటనే నా బంధువును విధుల్లోంచి తొలగించాలని’ కోరారు. ఆనాటి నాయకుల, విద్యావేత్తల నిజాయితీకి ఇది తార్కాణం. ఇపుడంతా ‘క్విడ్‌ప్రోకో’ పద్ధతిలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి.విద్యా వ్యవస్థలో ప్రక్షాళన, పరీక్షా విధానంలో తక్షణం  మార్పులు అవసరం అని  అటల్ బిహారీ వాజపేయి అబ్దుల్ కలాం వంటి మేధావులు దశాబ్ద కాలం కిందే సెలవిచ్చినా ఆ సూచనలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బుట్ట దాఖలు చేసాయి. సుబ్రహ్మణం, కస్తూరి రంగన్,నిషాంక్ వంటి కమిటీలు ఎన్నో విలువైనసూచనలు చేసినా వాటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోకపోవడం దురదృష్టకరం. ,లోపభూయి ష్టంగా విద్యావిధానం, పరీక్షల నిర్వహణ వల్ల విద్యార్థుల బాల్యం మసకబారిపోతున్నది.. లోపాల వల్ల విద్యార్థుల్లో ఆత్మగౌవరం స్థానంలో ఆత్మ న్యూనతా భావం , ఆత్మవి శ్వాసానికి బదులు ఆత్మహత్యలు, ఆత్మ సంయమనం స్థానంలో క్షణికావేశాలు  పెరుగుతున్నాయి. విద్యార్థులను నైతికంగా ఉన్నతులుగా తీర్చిది ద్దాల్సిన విద్యా వ్యవస్థ కేవలం మార్కులు తెచ్చుకునే రోబోలుగా తయారు చేస్తుండడం మిక్కిలి బాధాకరం. విధ్యార్ధులలో నైతికత, సానుకూల ధృక్పధం, నాయకత్వ లక్షణాలు,విభిన్న ఆలోచనా ధోరణులు నశించిపోవడం , వారిలో మానవతా విలువలు, మానవ సంబంధాల పట్ల ఆదరాభిమానాలు తగ్గుముఖం పట్టడం ఎంత మాత్రం సమర్ధనీయం కాదు. ఈ తరుణంలో విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు తక్షణ చర్యలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది
కామెంట్‌లు