భయం!!!!?;- ప్రతాప్ కౌటిళ్యా
శూన్యంలో శకలాల్లా
అంతరిక్షంలో గ్రహాలు
నిగ్రహం కోల్పోతున్నవీ!!!

ఆకర్షణలు రెండు
ఒకరు గురువు మరొకరు మహిళ
గురుత్వాకర్షణ విశ్వ గురుత్వాకర్షణలు వారు.!!

అదృశ్య శక్తి ఒకటి అల్లుకుంటుంది
నేల కింద నీరులా భూమిపై గాలిలా
ఎగిరిపోయే పక్షి నేటి వాతావరణం!!!
అర్థనగ్నమేఘం
గమ్యం ఇప్పుడు గందరగోళం!!!

నల్లగా మారిన నక్షత్రాలు
చల్లబడ్డ నమూనాలు కరిగి విరిగిన పాలు
భూమి రూపాలు.!!

మెరుపుల తీగలు ద్వారాలు తెరుచుకునే తాళంచెవులు.
బ్రద్దలైన  బ్రహ్మాండం శబ్దం నిశ్శబ్దంగా నిక్షిప్తమయింది.!!

రంగుల్ని మింగేసిన దృశ్యం ఎక్కడో బయటపడింది.!!?
దగ్గరికి చేరుకోలేవు దూరంగా పేలిపోలేవు
ఒకదాని నుంచి ఒకటి వీడిపోలేవు.
నిస్సత్తువే మిగిలిన ఆకారం.!!!

జరిగింది నిజం
ఇలా జరుగుతుందని ఎవరికీ తెలియదు
అంతా యాదృచ్ఛికం ఒక విచిత్రం!!?

నిర్మించబడింది నిజంగా ఊహించలేదు.
మళ్లీ నిర్మించడం నిజంగా అసాధ్యం.!!!

పదార్థం శూన్యం ఒక శక్తి
ఆలోచన ఊహా దాన్ని మించిన మరో శక్తి!!.

తలకాయ
స్త్రీ పురుష పుష్పం నుంచి వచ్చింది.
దాని విత్తనాన్ని దాచి పెట్టండి.
కొత్త తలకాయలు కాస్తాయి.!!!?

ఎత్తయిన పర్వతం నుంచి కిందికి చూడకండి.!!!
లోతైన లోయ లోంచి పైకి చూడకండి!!
భయమేస్తుంది ఆ భయమే ఒక భూమి.!!?

ప్రతాప్ కౌటిళ్యా 🙏🙏

కామెంట్‌లు