236)సుప్రసాదః -
చక్కని అనుగ్రహమునిచ్చు వాడు
భక్తులనాదరించుచున్న వాడు
కోరింది అందించగలిగినవాడు
మనోభీష్టములను దీర్చువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
237)ప్రసన్నాత్మా-
రాగద్వేషములు లేనివాడు
కలుషితభావన ఎరుగనివాడు
పరిశుద్ధ అంతఃకరణ గలవాడు
పంకిలమంటలేని పావనుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
238)విశ్వదృక్ -
విశ్వమును ధరించినవాడు
దృక్ పథమునందున్నట్టి వాడు
జగత్తును చూచుచున్నవాడు
లోకదృష్టిని కలిగియున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
239)విశ్వభుక్ -
విశ్వమును భక్షించునట్టివాడు
అంతయు జీర్ణించుకొనువాడు
లోకములు జిహ్వయందున్నవాడు
బాలకృష్ణయై భాసిల్లువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
240)విభుః -
బ్రహ్మరూపమందున్న వాడు
విష్ణుస్థితిని చూపించువాడు
హరుడై లయించునట్టి వాడు
అన్ని మూర్తులు తానైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి