వోని పాఠశాలకు ఎస్.ఎస్.సి మోడల్ టెస్టుపేపర్ల బహూకరణ.

 ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటీఎఫ్) రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలకు పదోతరగతి మోడల్ టెస్ట్ పేపర్లను ఉచితంగా పంపిణీ గావిస్తున్న నేపథ్యంలో, తమ వోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలకు నేడు అందజేసారని ప్రధానోపాధ్యాయని బలగ నాగమణి అన్నారు.
గత పదేళ్ల నుంచి ఇలా పదవతరగతి విద్యార్థులు సత్ఫలితాలు సాధించాలన్న ధృడ సంకల్పంతో యుటిఎఫ్ వారు ఉచితంగా మోడల్ టెస్టుపేపర్ల పంపిణీ చేయు ఔదార్యాన్ని ఆమె అభినందించారు. 
ఈ సందర్భంగా ఈ పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ 
రాజాం యుటిఎఫ్ శాఖవారు తమ పాఠశాలకు ఈ పుస్తకాలను బహూకరించుట పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా విద్యార్థులకు చక్కని తర్ఫీదునిస్తున్నారని అన్నారు. ఉపాధ్యాయులందరి వ్యూహరచనలనూ పాటిస్తూ ప్రధానోపాధ్యాయులంతా మంచి ఫలితాలు సాధించేదిశగా కృషి చేస్తున్నారని తిరుమలరావు అన్నారు. నేడు యుటిఎఫ్ బహూకరించిన ఈ పుస్తకాలలో గల కీలకమైన అంశాలను విద్యార్థులు అనుసరించేలా చూస్తామని  అన్నారు. కుదమ తిరుమలరావుతో పాటు యుటిఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు మువ్వల రమేష్, బలివాడ నాగేశ్వరరావులు విద్యార్థులనుద్దేశించి సూచనలు గైకొన్నారు. ఈ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకూ అభ్యసించి నేడు పాలకొండలో పదోతరగతి చదువుతున్న  
విద్యార్థులు కనపాక బేబీరాణి, ఒమ్మి శివకుమారి, కనపాక అస్మిత, మర్రి పూజిత, మామిడి జ్యోత్స్న, కనపాక దివ్యశ్రీ తదితరులకు పుస్తకాలను బహూకరించారు.
కామెంట్‌లు