అతని దినచర్య;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రోజూ
అతనిది
అదే శ్వాస
అదే ధ్యాస
అదే మూస

రోజూ
అతనిది
అదే నడక
అదే దారిపట్టి
అదే గమ్యానికి

రోజూ
అతనిది
ఒకటే వ్రాత
అక్షరాలు ఏరి
పదాలు పొసిగి

రోజూ
అతనికి
అవే ఆలోచనలు
వంటినిండా
తలనిండా

రోజూ
అతనివి
కమ్మని కవనాలు
కలమును పట్టి
కాగితాలు నింపి

రోజూ
అతగాడివి
బలే వడ్డింపులు
రుచిగా
శుచిగా

రోజూ
అతనిది
అదే పని
సాహితీసేద్యం చేయటం
కైతలపంట పండించటం

రోజూ
అతగాడివి
అవే కూర్పులు
అందాలు చూపాలని
ఆనందాలు కలిగించాలని

రోజూ
అతనిక్రియ
వస్తువుల వేటాడటం
ఊహల ఊరించటం
మాటల మూటకట్టటం

రోజూ
అతనిది
ఒకటే పూజ
తెలుగుతల్లిని తలచి
వాణీదేవిని ధ్యానించి

రోజూ
పాఠకులకి
నచ్చుతుందా
ముచ్చట కొలిపి
మనసులను దోచి

చూద్దాం
మనం
వేచిచూద్దాం
కొంతకాలం
సమయమిద్దాం


కామెంట్‌లు