సుప్రభాత కవిత ; - బృంద
అదుపులేని అపనమ్మకాలను
అణగదొక్కి 
అంతరంగాన గట్టి సంకల్పము
నిలబెట్టి

అపజయపు నీడలెన్ని
అదును చూసి ఆక్రమించినా
అధిగమించి తడబడక
అడుగులేసి

అభద్రతగ అనిపించినా
అప్రమత్తత కలిగి
అణువణువూ జాగర్తగా
అర్థం చేసుకుంటూ...

ఆత్మబలం కలిగి వుండి
ఆటంకాలకు అలమటించక
అదురుబెదురు లేని
అచంచల నిర్ణయంతో...

ఆలోచనలో మేలైనవి
ఆచరణగ  చేసుకుని
అందలేని శిఖరాలన్నీ
అందుకుని ఆనందపడమనే

అద్భుతమైన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸


కామెంట్‌లు