అమృతతుల్యమైన ఆలోచనల వలన శరీరం, మనస్సు, ఆత్మ ప్రక్షాళనం , జీవితం ప్రతీ క్షణం నందనవనం వలే ఆహ్లాదభరితం , విషతుల్యమైన ఆలోచనల వలన సమస్తం విషపూరితం , జీవితం లో ప్రశాంతత మటుమాయం .
అనుక్షణం భయానకం , నరకప్రాయం , మన ఆలోచనలే మన జివితాలకు నిర్దేశం , మన ఆలోచనలే ప్రపంచాన్ని రూపుదిద్దును . ఈ నగ్న సత్యం గుర్తెరిగి సానుకూల ధృక్పధంతో ఆలోచనా విధానం గావించుట అత్యావశ్యకం .ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఆలోచనలు మీవి కావు; అవి మీ మీద పడిన సామాజిక ప్రభావాల వల్ల మీలో చేరాయి. అవి ఇతరులు ఇచ్చే సలహాల వంటివి, వాటిని మీరు స్వీకరించాలనుకున్నా, పట్టించుకోవద్దనుకున్నా, ఆ నిర్ణయం మటుకు మీదే, అవునా, కాదా?
ఆలోచన మిమ్మల్ని ఎక్కడికీ తీసుకువెళ్ళదు. ఆలోచన సలహాలను ఇస్తుంది, వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం అని సద్గురు జగ్గీవాసుదేవ్ అద్భుతంగా చెప్పారు.
మనస్సు ఇంద్రియాలచేత తెలియబడదు. మాయలాగే నిగూఢమైనది. ఎల్లప్పుడూ మార్పుచెందుతూ ఉంటుంది. అనుభవాలు అభిప్రాయాలు కోరికలు వాసనలు మొదలైనవాటితో సాధారణమైన మనస్సు మలినమై ఉంటుంది. కోపము భయము విస్మయము మొదలైన ఉద్వేగాలతో మార్పుచెందుతూ ఉంటుంది. ఒకవిషయం మీదనుండి మరోవిషయం మీదికి దుముకుతూనే ఉంటుంది. అందుకే ఇలాంటి చంచలమైన మనస్సును కోతితో పోల్చడం జరిగింది.
మంచి చెడు రెండూ కూడా మనిషి చేసే కర్మల వల్ల పొందే ఫలితాలే. యద్భావం తద్భవతి అంటారు. మనము ఏది ఎక్కువగా తలుస్తాము అదే అవుతాము. చాలా వరకు సమస్యలు మానసిక భయాల వల్ల కలిగేవే. ఈ భయాలను అధిగమించి మనలోని ఆత్మవిశ్వాసాన్ని బలపరుచుకుంటే మనని ఏ శక్తులు బాధపెట్టలేవు.
మీరు కొంచెం సానుకూల ఆలోచనను చెయ్యడం ప్రారంభిస్తే, మీరు ఎన్నడూ సాధ్యం కాని విషయాలను సాధించడం జరుగుతుంది . పెద్దగా ఆలోచించడం నిజంగా అమెరికన్ వాళ్ళు చేస్తుంటారు అది మన దేశాన్ని సుసంపన్నం చేసింది. మీరు వారిని అనుసరించవచ్చు, వారు వారి సృజనాత్మక మనస్సులోకి ప్రవేశించి, ఎక్కువగా పని చేయడం ప్రారంభిస్తారు.
నీ భవిష్యత్తును నీవే నిర్ణయించుకో, గడిచిన విషయాలను పదే పదే తలచుకుంటూ సమయాన్ని వృథా చేయకు. హద్దులు లేని భవిష్యత్తు నీముందు పరుచుకుని ఉందన్న విషయం మరిచిపోవద్దు. నీ యొక్క ప్రతిమాట, కదలిక, ఆలోచన అందుకు తగిన ఫలితాలనిస్తాయనే విషయాన్ని కూడ మరిచిపోవద్దు.
నీలో దాగి ఉన్న చెడు ఆలోచనలు, నీపై దాడి చేసేందుకు పులల వలె కాచుకుని ఉన్నాయి. అదేవిధంగా నీలో ఉన్న మంచి ఆలోచనలు, సత్ప్రవర్తన, ముక్కోటి దేవతల శక్తితో సమానమైన ఫలితాలనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయన్న విషయాన్నీ గుర్తించుకో....అన్న స్వామి వివేకానంద ప్రబోధం మనందరికీ స్పూర్తిదాయకం.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి