326)ప్రతిష్టితః -
తనమహిమనిలిపిన వాడు
ప్రతిష్టింపబడినట్టి వాడు
నిర్మాణం చేయబడినవాడు
మూలమందు నిలిచినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
327)స్కందః -
అమృతరూపము గలిగినవాడు
సుధలు స్రవించునట్టివాడు
అమృతోపమానమైనవాడు
స్కంద రూపంలో నున్నట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
328)స్కంద ధరః -
ధర్మమార్గం చూపించువాడు
ధర్మమును ధరించిన వాడు
ధర్మమును నిలుపునట్టివాడు
స్కందధరుడని పేరున్నవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
329)ధుర్యః -
సర్వజీవులను మోయుచున్నవాడు
ఉత్పత్తిభారము వహించువాడు
బాధ్యతలన్ని తానైన వాడు
లోక భారమును మోయునట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
330)వరదః -
వరములను ఒసగెడివాడు
భక్తులను బ్రోచునట్టివాడు
కష్టములో ఆదుకొనువాడు
వరదరాజస్వామి యైనవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి