శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
281)చంద్రాంశుః -

చంద్రకిరణముల వంటివాడు 
సోముని అంశకలిగినవాడు
చల్లదనము ప్రసాదించువాడు
వెన్నెలకాంతిని ఇచ్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
282)భాస్కరద్యుతిః -

సూర్యతేజము వంటివాడు
భాస్కరద్యుతి కలిగినట్టివాడు
విశ్వప్రకాశనము జేయువాడు
శక్తికిరణాలు ప్రసరించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
283)అమృతాంశూద్భవః -

చంద్రునిపుట్టుక కారకుడు
అమృతము సృష్టించినవాడు
సోమకాంతి స్వరూపమున్నవాడు
చంద్రునిసృజంచినట్టివాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
284)భానుః -

సూర్యప్రకాశ స్వరూపుడైనవాడు
స్వయంతేజో వంతుడైనవాడు
లోకసాక్షిగా చరించువాడు
రవితేజస్సు గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
285) శశిబిందుః

చంద్రకాంతియై పరచుకొనువాడు
శశివలే ప్రజాపోషకుడు
చంద్రుని విస్తరణగలవాడు 
వెన్నెలయై సేదదీర్చువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు