మాఘమాస జాతర*- :ఉండ్రాల రాజేశం
ఛందస్సు:- అటవెలది
-----------------------------
మాఘమాస మొచ్చె మహిన జాతరపిల్చె
బండచుట్టు జనులు బండ్లతిప్పి
బండపైకి యెక్కి భక్తితో పూజలు
భావిపౌరులార బాలలార

నాల్గు వైపులందు నడుచుతూ జనులంత
మురుసుకుంట బాట ముత్యమల్లె
పొర్లు దండమందు పుల్లూరు నర్సింహ్మ
భక్త జనుల కాంచు భాగ్యమల్లె

రంగురాట్నమెక్కి రాజసంగ తిరిగి
బోమ్మలన్ని కొంటు బుగ్గలాడి
పడుచు పెద్దలున్న పరుగుల జాతర
భావిపౌరులార బాలలార

కూడవెల్లి జేరి గుండాన మునిగియు
రామలింగసామి రక్షయంటు
జాతరంత తిరిగి జాగార జేస్తిమి
భావిపౌరులార బాలలార

పల్లెజనులు వచ్చె పరువాల జాతర
కాలినడక తోనె కలిసిరంత
పులకరించి పోవు పుల్లూరు జాతర
భావిపౌరులార బాలలార

దక్షణమున కాశి దండిగా జనులంత
మూడు వాగులందు మురియుతుండ్రి
సకల జనులు మొక్కు స్ఫటిక లింగమునకు
భావి పౌరులార బాలలార

కామెంట్‌లు