దత్తపది:సాహితీసింధు, పద్యగుణవతి సరళగున్నాల

 :చాలు మేలు వాలు కాలు
====================
చాలు విదేశి సంస్కృతియు చక్కని చీరలకట్టుబొట్టుతో
మేలొన గూరు చుండు మిము, మేధిని యందున గౌరవమ్ముతో
వాలు పురస్కృతుల్ శివుని ఫాలమునందున నుండుభూతితో
కాలుడు నైన పారునట కావున భారత దీక్షనందుకో
కామెంట్‌లు