శ్రీ విష్ణు సహస్రనామాలు - (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
301)యుగావర్తః -

యుగములను తిప్పుచున్నవాడు
అంతయు ఆవరించినవాడు
యుగానుసరణ చేయువాడు
యుగములను సృజించుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
302)నైకమాయః -

మాయాశక్తులు గలిగినవాడు
అనేకరూపాలు ధరించువాడు
మాయప్రదర్శనము చేయువాడు
భక్తులననుగ్రహించుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
303)మహాశనః -

సర్వమును కబళిoచువాడు
అన్నిటిని భుజించువాడు 
మహాశనుడయినట్టి వాడు
సర్వo ఆహారముగా గలవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
304)అదృశ్యః -

దృశ్యము కానట్టి వాడు
కనిపించని విధమున్నవాడు 
అదృశ్యరూపంలోని వాడు
శూన్యరూపములోని వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
305)వ్యక్తరూపః -

భక్తుల హృదయంలో ఉన్నవాడు
అనేక రూపాలలోనున్నట్టివాడు
దృశ్యమానమైనట్టి వాడు
ఆకృతినిగల్గి యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు