జీవన నౌక- : జగ్గయ్య.జి
జీవితం ఒక యుధ్దం! పోరాడు!
కడలులు అయినా 
అడుగు అడుగున మొసలి మడుగులయినా
ఆగకుండా సాగాలి జీవన నౌక!

కష్టాల నొప్పులయినా 
సుఖాల హాయిలయినా 
హై లెస్స అంటూ నడిపించాలి నావను
ఈదాలి బంధాల సముద్రాలను!

అలలు వచ్చినా దాటిపోవాలి అలవోకగా
కెరటాలు తాకినా సాగిపోవాలి కేరింతలతో
దాటాలి మెట్టులుగా అవరోధాలను
చేరాలి ఆత్మీయతా తీరాలను!

పోరాటం అలవాటైతే
జీవితం ఓ ఆటలా ఆనందంగా ఉంటుంది
కష్ట సుఖాలు ఊయలలవుతాయి
కొత్త కొత్త ఊహలకు ఊపిరి పోస్తాయి!

సంతోషమంటే కష్టాలు లేవని కాదు
వాటిని దాటే దారులు తెలుసని 
గులాబికి ఉంటాయి గుచ్చుకునే ముళ్ళు
తెంచుకునే తెలివి ఉండాలి!

చేప ఈతలో అలసిపోతుందా
చేవ ఉన్నవాడు  జీవితంలో అంతే!
అలసిపోకుండా కదిలిపోయేది
ఆగకుండా సాగిపోయేది జీవన నౌక!!

జగ్గయ్య జి

కామెంట్‌లు