256)వృషాహీః -
అనేక ధర్మదిన సాధకుడు
ధర్మము నడిపించగలవాడు
ధర్మపూరితుడైనట్టి వాడు
సామూహిక ధర్మ సాధకుడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
257)వృషభః -
భక్తాభీష్టములు నెరవేర్చువాడు
వృషభాచలమునందున్నవాడు
ఓషధీ విశేషం వంటివాడు
కవివృషభునియందున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
258)విష్ణుః -
సర్వత్రా వ్యాపించినవాడు
ఆదిత్యుని సమానమైనవాడు
శతానంద రథమున్నవాడు
దారకుడు సారథియైనవాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
259)వృషపర్వాః -
ధర్మసోపానాలు నిర్మించినవాడు
భక్తులను ధర్మముకు చేర్చువాడు
ధర్మమందు ప్రవేశపెట్టువాడు
తనసాయం ధర్మాత్ములకిచ్చువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
260)వృషోదరః -
ధర్మమును ధరించినవాడు
ఉదరమందున నిలిపినట్టివాడు
ప్రజాధర్మము నిలబెట్టువాడు
ధర్మబద్ధులనుచేయునట్టివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి