ఊహలు వాస్తవాలు
సమాంతర రేఖలు
సర్దుబాట్లు రాజీలు
కలిపి వుంచే అడ్డుకర్రలు
మనసు హృదయం
సహకరించుకోవు
విచక్షణ ఇంగితం
ముందుకు నడిపిస్తాయి
కలలు తీరాలని
ఎదురుచూస్తున్నా
కలిసి రాని కాలంతో
కలిసిపోయి బ్రతికేస్తాము
నిన్నటికన్నా రేపు గొప్పనీ
రేపటికన్నా నేడు మనదనీ
ఏది వస్తే అదే మనదని
మది నింపుకుని నవ్వేస్తాము
జీవిత పయనంలో
గమ్యానికి చేర్చే
ఎన్నో మలుపులూ
మరెన్నో మజిలీలు.
కలిసే పరిచయాలు
కలవని బంధాలు
తడిసే కనులు
నిలిచే మమతలు
వెలిగి పిలిచే తూర్పు
కొని తెచ్చే మార్పు
కోటి సమస్యల తీర్పు
కమ్మని క్షణాల కూర్పు
దోసిట నింపిన కోర్కెలతో
ద్వారాన వేచిన వేకువకు
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి