వాయిదా! అచ్యుతుని రాజ్యశ్రీ

 మంచిపనులు వెంట వెంటనే చేయాలి.కాసేపైనాకచేద్దాం రేపు చేద్దాం అని వాయిదా వేయకూడదు.జూన్లో బడి తెరిచి పాఠాలు మొదలు పెట్టగానే చదివితే పరీక్షల టెన్షన్ ఉండదు.మహాభారతం చెప్పింది ఇదే.దానం చేయాలి అంటే కర్ణుడు ఎంత పనిలో ఉన్నా ఆపి అడిగినవారికి కోరింది ఇచ్చి పంపేవాడు.కబీర్ దాసు కూడా అదే అంటాడు.రేపటి పని ఈరోజు ‌ఇవాల్టి పని ఇప్పుడు చేసి హాయిగా కూర్చో.అలాగే త్యాగం అంటే డబ్బు కాకున్నా మనకున్న కొంతసమయం ఎదుటివారికోసం వెచ్చించాలి.సంస్కృత పండితుడు అభినవ గుప్తుడు రాత్రి దీపంలో నూనె ఐపోయి ఆరిపోయింది.పాపం కళ్ళు మూసుకుని మననం చేస్తూ ఉంటే సరస్వతీ దేవి అంది" నీకు సకలవిద్యలు కష్టపడకుండా ప్రసాదిస్తాను." దానికి ఆయన " అమ్మా! అలా కష్టపడకుండా వద్దు.నేను బాగా చదివి అధ్యయనం చేస్తేనే పట్టు  చదువు వస్తుంది.దీపంలో నూనె అనుకోకుండా చూడు తల్లీ!" అంటే మనం ఏడాది పొడుగునా చదివితే సబ్జెక్టు పై పట్టు వస్తుంది.ముక్కున పట్టి తే మార్కులు రావచ్చు కానీ మంచి పునాది ఏర్పడదు.పరీక్షలో తక్కువ మార్కులు వస్తాయి అనే భయం వీడి రాయాలి.అప్పుడే రిజల్ట్ గూర్చి ఆలోచన వద్దు.పరీక్ష పేపర్ చూసి కంగారు వద్దు.ఇంటికెళ్ళి రైట్ తప్పు ఆలోచన చేస్తే మర్నాటి సబ్జెక్టు చదవలేము. ఎప్పటి పని ఆలోచన అప్పుడే సుమా🌺
కామెంట్‌లు