సౌందర్యలహరి - కొప్పరపు తాయారు
    🌟 శ్రీ శంకరాచార్య విరచిత 🌟


నిసర్గక్షీణస్య స్తనతటభరేణ క్లమజుషో
నమన్మూర్తేర్నారీతిలక శనకైస్త్రుట్యత ఇవ ।
చిరం తే మధ్యస్య త్రుటితతటినీతీరతరుణా
సమావస్థాస్థేమ్నో భవతు కుశలం శైలతనయే ॥ 79 ॥

కుచౌ సద్యఃస్విద్యత్తటఘటితకూర్పాసభిదురౌ
కషంతౌ దోర్మూలే కనకకలశాభౌ కలయతా ।
తవ త్రాతుం భంగాదలమితి వలగ్నం తనుభువా
త్రిధా నద్ధం దేవి త్రివలి లవలీవల్లిభిరివ ॥ 80 ॥

79)ఓ తల్లీ ! శైలతనయా! నీ నడుము సహజముగానే కృశించినది. స్తనభారం చేత వంగినట్టై నాభి నడుము యొక్క ముడతలను ఉన్నచోట నుండి ఎక్కడ తెగిపోతాయేమో అన్నట్లు
ఉన్నది. గట్టు తెగిన నదీ తీరంలో ఉన్న చెట్టు వలె ఊగింది అంతటి అపరంజి బొమ్మై నట్టి అమ్మవారు మమ్ము కాపాడుగాక !
80) ఓదేవి! పార్వతీ! అనుక్షణం ఈశ్వరుని ధ్యానించుటచే చమర్చిన రవికను బిగించుచున్నవి యు బాహు మూలముల ధైర్యం చున్నవియు నగు,బంగారు కుండల వంటి నీ స్తనములను నిర్మించుచున్న మన్మధుని చేత , ఈ స్తనముల బరవునకు  నడుమపాయము నొంద
కుండుటకై తెల్లని తీగలతో మూడు కట్లు గట్టెనో
యని యూహ ఒడము చున్నది కదా తల్లీ!
                       ***🌟***
,🌟 తాయారు 🪷

కామెంట్‌లు