భక్త చోఖామేళ! అచ్యుతుని రాజ్యశ్రీ

 తక్కువ జాతి కులంలో పుట్టాడని ఆపరమభక్తుడు చోఖామేళ నా గుడిలో ప్రవేశం కల్పించరు..ఆలూరి పెద్దలు.పాండురంగని స్మరణ తో కన్నీరు కారుస్తున్న భర్తని సముదాయిస్తుంది  సాయిరాబాయి.అన్నం తినకుండా దిగాలుగా నిద్రపోని చోఖాముందు ప్రత్యక్షమైనాడు దేవుడు.ఆరాత్రి తలుపులు మూసిన గుడిలోకి తనతో తీసుకుపోయాడు.తెల్లారింది.గుడిపూజారులు తాళం తీసి గర్భగుడిలో దేవుని విగ్రహం ముందు కన్నీరు కారుస్తున్న భక్తి లో మునిగిన చోఖాని బైటికి గెంటిస్తారు. " అయ్యలారా! స్వయంగా దేవుడే నన్ను ఇక్కడికి తెచ్చాడు.నాకేంతెలీదు" అని ఎంత చెప్పినా ఊరంతా అతన్ని బహిష్కరిస్తుంది. బిడ్డ తన మలమూత్రాలతో తల్లిని రోజూ గలీజు చేసినా ఆమె సహిస్తుంది. అలాగే పాండురంగడు చెట్టు కింద అన్నం తింటున్న చోఖా దగ్గరకు వచ్చి " నాకు అన్నం పెట్టు" అని సాయిరాబాయిని అడుగు తాడు.ఆమె పెరుగు వడ్డించి నపుడు అది పాండురంగని పట్టుపీతాంబరంపై ఒలికిపోతుంది. కోపం తో చోఖా భార్య ను గద్దించాడు " కళ్ళు కన్పడటంలేదా? ఎటు చూస్తున్నావు?" ఆదారినే వెల్తున్న పూజారి తననే అన్నాడని భావించి చోఖా చెంపల్ని ఛెళ్ళుమన్పిస్తాడు. ఆపై ఆలయం తలుపులు తెరిచి గర్భగుడిలో పాండురంగని విగ్రహం చెంపలు కందిపోయి కన్నీరు కార్చడం చూస్తూ విస్తుపోయాడు.చోఖా దగ్గరకు పరిగెత్తి కాళ్ళపై పడ్తాడు.అంతటి మహాత్ముడు చోఖా  కూలీ పనికి వెళ్లి గోడ కూలి మరణిస్తాడు.ప్రాణం పోయేదాకా విఠలనామమే జపిస్తాడు. చనిపోయిన కూలీలతోపాటు చోఖా శవంని కూడా దహనం చేశారు.పాండురంగడు భక్త నాందేవ్ కి కన్పడి" చోఖా అస్థికలు సేకరించి ఆలయం ముందు సమాధి గావించు" అంటాడు." స్వామీ! సామూహిక దహనం చేశారు కదా? ఎలా గుర్తించాలి?" అని నాందేవ్ అడిగాడు."చెవి దగ్గర ఎముకలు పెట్టుకుని విను.పాండురంగ నామం విన్పించే ఎముక చోఖా ది అని గుర్తించాలి." అలా నాందేవ్ చేతిలోని ఎముకలు చెవి దగ్గర పెట్టుకుంటే చోఖా ఎముక" విఠలా విఠలా పాండురంగ" అనడంతో నిశ్చేష్టులైన నాందేవ్ వాటిని తెచ్చి ఆలయం ముందు సమాధి చేస్తారు.భక్తికి దైవానుగ్రహం కి జాతి కులంతో పని లేదు.సదా మనకు నచ్చిన దైవం పేరుని పైకి ఉచ్చరిస్తే ఇతరుల చెవిలో పడి వారు కూడా తరిస్తారు కదూ? కలియుగం లో దైవ స్మరణ చేస్తూ బతకడం పాపవినాశనం.తపస్సుతో పనిలేదు సుమా🌷
కామెంట్‌లు