కుసుమ ధర్మన్న కళాపీఠం
------------------------------------
జీవితం..అలుపూ సొలుపు లేనిదై
ఆరాటపోరాటపడే గెలుపు ఓటములతో
పోటీపడుతూ ఆటలాంటిదే...
క్షణక్షణానికి ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని
కొత్తరాగాల ఆలాపనలకు సరిగమల్ని
సమకూర్చే సంసారగీతాన్ని సాగించేది...
కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ
చిన్ని అనుభవాలను ఒడిసిపట్టి
ఒడిదుడుకుల దాటుతూ గట్టుకు చేర్చేది..
గుండెతడి ఊరుతూ అనుభూతి వెల్లువలై
ఆనందక్షణాల్ని గుప్పెట్లో బిగించి
ఆత్మతృప్తినొసగే భరోసాగా మార్చుకొనేది...
సంపాదన యావతో కొట్టుమిట్టాడే
బతుకీడుస్తూ బాదరాబందీ చట్రంలో
ఇరుక్కోక సంయమనం పాటించేది....
ఎదలయలో సందడి ఊగే ఊయలై
మధువొలక బోసే సమయాలతో
కలిసి జీవం పోస్తూ పయనించేది....
చిరునవ్వులు చిందిస్తూ పువ్వులు రువ్వే
కొలువైన దైవత్వమే ఆనందోబ్రహ్మగా
మలచుకొనే జీవనశైలిలో శిల్పించేది....
వెంకటేశ్వర్లు లింగుట్ల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి