మానవుడు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 శ్రీమహావిష్ణువే దశరథరాజుకు
మానవుడై శ్రీరాముడుగ జన్మించాడు
తనతండ్రి ఆనతితో శ్రీరాముడు
సతీ సహోదరుడితో కానలకెళ్ళాడు
దుష్టులైన బహురక్కసుల దునిమి
శిష్టులందరిని రక్షణచేశాడు
తండ్రి అంటే రామయ్యతండ్రి అని
జగాన ఖ్యాతిని పొందాడు
ముద్దులగుమ్మ సీతమ్మ
బంగరుబొమ్మ సీతమ్మ
జనకుని సుతగా పుట్టీ
మిథిలాపురము చేపట్టీ
సిరుల రాముని చేయిపట్టీ
ఘన గుణముల పుణికిపట్టీ
సకలసంపదలు పురమున వదిలీ
అడవికి అయినా మగనితొ నడిచీ
శీలపరీక్షకు ఎదురుగ నిలిచీ
నిప్పులనుంచీ నవ్వుతు వచ్చీ
తల్లి అంటే సీతమ్మతల్లి అని
జగతిన పేరు వడిసిందమ్మా !!
**************************************

కామెంట్‌లు