హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 61.
ఉత్పలమాల.
చందన చర్చితంబయిన చక్కని దేహము వెల్గులీనగా
నిందిర వడ్డనల్ సలుప నింపగు భోజ్యములారగించునిన్
విందుకు పిల్చినారమయ!వేడ్కగ రాగదె మా గృహంబుకున్
ముందఱ బెట్టెదన్ మధుర భోజ్యము లన్నియు ప్రీతిగన్ హరీ!//

62.
ఉత్పలమాల.
కొండలరాయ!వండితిని కూరలు కమ్మని శాకపాకముల్
మెండుగ భక్ష్యభోజ్యములఁ మీఱిన  శర్కర పిండివంటలన్ 
దండిగ యప్పడంబులను దట్టెడు లడ్డులు తీపిబూరెలన్
కుండల నిండుగన్ బెరుగు కూరిమితో భుజియించుమా హరీ!//

కామెంట్‌లు