సౌందర్యలహరి; - కొప్పరపు తాయారు
  🌟శ్రీ శంకరాచార్య విరచిత 🌟

దృశా ద్రాఘీయస్యా దరదలితనీలోత్పలరుచా
దవీయాంసం దీనం స్నపయ కృపయా మామపి శివే 
అనేనాయం ధన్యో భవతి న చ తే హానిరియతా
వనే వా హర్మ్యే వా సమకరనిపాతో హిమకరః ॥ 57 

అరాలం తే పాలీయుగలమగరాజన్యతనయే
న కేషామాధత్తే కుసుమశరకోదండకుతుకమ్ ।
తిరశ్చీనో యత్ర శ్రవణపథముల్లంఘ్య విలస-
న్నపాంగవ్యాసంగో దిశతి శరసంధానధిషణామ్ 

57) హేశివే ! కించి ద్వికసిత నీలోత్పలశోభా యుక్తమై బహుదూరం ప్రసరించగల నీ దృష్టితో దయ తలచి దూరంగా ఉన్న దీనుడైన నన్ను కూడా స్నానం మొనరింప చేయుము. తద్వారా మేము ధన్యులమవుతాము. అందులో నీకు కలిగే హాని ఏమీ లేదు. ఎందుకంటే చంద్ర కిరణాలు అడవిలోనూ, రాజభవనాలలోనూ సమంగానే పడుతూ ఉన్నాయి కదా తల్లీ!

58) జననీ! బాసిల్లే భవదీయకపోలాలపై ప్రతిఫలించే స్వర్ణ పుష్ప ద్వైయంచే  యుక్తమైన నీ వదనం కామదేవుడి నాలుగు చక్రాల రథాన్ని స్పురింప జేస్తున్నది. దాన్ని ఆశ్రయంగా చేసుకుని, మహావీరుడైన మన్మధుడు సూర్య చంద్రులే, చక్రాలుగా గల పృథ్వీరూప రధాన్ని అధిరోహించి,
యుద్ధార్థం ప్రమద గణంతో, స్థిరచిత్తంతో వచ్చిన శంకరుని కి ఎదురుగా నిలిచి నాడు కదా తల్లీ !
                ***🌟***
🌟. తాయారు 🌟

కామెంట్‌లు