దామోజీపంత్! అచ్యుతుని రాజ్యశ్రీ

 బీదర్ నవాబు కొలువులో దామోజీపంత్ ఒక ఉద్యోగి.మంగళవేధా గ్రామంలో నివాసం.శిస్తువసూలు చేసే ఉద్యోగి.ఆయనభార్యసావిత్రిబాయి.పాండురంగని భక్తులు ఆదంపతులు.తమకు కావాల్సిన ధాన్యం ఉంచుకుని మిగతాది దానధర్మాలు చేసేవారు. ఒకసారి పండరీపురం లో తీవ్ర మైన కరువు వస్తే
భార్యాబిడ్డలను వదిలి ఒక బ్రాహ్మణుడు పంత్ ఇంటిముందు శోషవచ్చి పడిపోతాడు.పంత్ దంపతులు అతనికి అన్నం పెట్టి విషయం తెల్సుకుని 
అతనికి ధాన్యం బండిపై వేసి పంపుతారు.ఇదితెల్సుకున్న ఆగ్రామస్థులు కూడా
తమకూ ధాన్యం పంపమని కోరటం ప్రభుత్వం కి ఇవ్వాలని ఉంచింది పంత్ పంపడం జరిగింది.2 పంత్ అంటే అసూయ ద్వేషంతో ఉన్న కృష్ణ మజుందార్ ఆవిషయం బీదర్ నవాబు కి చెప్పాడు.నవాబు భటుల్నిపంపి తే వారు పంత్ నా బందీచేసి తెస్తూ పండరీపురం లో రాత్రి ఆగుతారు.పాండురంగడు పంత్ నిఅనుగ్రహించి
నవాబ్ దగ్గరకు వెళ్ళి " ప్రజలు ధాన్యం వెల చెల్లించారని ఎక్కువ ధరకే అమ్మిన ఆడబ్బుని పంత్ తనద్వారా పంపాడని"చెప్పి రసీదు తీసుకుని మాయం అయ్యాడు.ఆమర్నాడు పంత్ నా బందీచేసి తెచ్చిన భటుల్ని చూసి ఆశ్చర్య పోయాడు నవాబు.
పాండు రంగడే తనని ఆదుకున్నాడు అని కన్నీరు కార్చాడు పంత్.నవాబ్ కృష్ణ మజుందార్ని చెరసాలలో పెడ్తుంటే వద్దని వారించారు పంత్.భార్యతో కల్సి శేషజీవితాన్ని పాండురంగని సేవలో తరించి ముక్తి పొందారు.
కామెంట్‌లు