.చీకటి వెలుగు- కళావతి కందగట్ల-హైదరాబాద్
కుసుమ *ధర్మన్న కళాపీఠం 
====================
జీవితం
నల్లేరుపై నడకేం కాదు
పూలు  పరిచిన
రహదారీ కాదు....
జీవిత పయనం లో 
కంటకాల కష్టాలే ఎదురవుతుంటాయి 
ఎక్కువగా...

దుఃఖాల సుడిగుండాలు
దాటినప్పుడే కదా
సుఖాల మధురిమ
తెలియవచ్చేది...

కాలభ్రమణానికే
తప్పలేదు....
అమావాస్య చీకట్లు
వెలుగు పున్నములు...

క్రుంగి పోక
నిరాశ పడక...
మొక్కవోని ధైర్యం తో
సాగించు నీ నడక...

నీ విజయాన్ని 
అడ్డుకునే ఏ సమస్యలనైనా
అవలీలగా అధిగమించు
అనుకున్న లక్ష్యం వైపే
నీ దృష్టి సారించు...

వృధా కాదు ఎపుడూ
నీ కఠోర శ్రమ...
నీ అంకుఠిత దీక్ష కు
పారిపోదా పరాజయం 
గెలుపు వాకిట నిను చేర్చి....


కామెంట్‌లు